ఈరోజు తెల్లవారుజామున విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జి పాలిమర్స్ అనే ప్లాస్టిక్ తయారీ కంపెనీ లో జరిగిన భారీ ప్రమాదం ప్రస్తుతం ప్రజల ప్రాణాల మీదికి తెచ్చింది. ఒక్కసారిగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి విషవాయువు వెలువడడం అది చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల మేర వ్యాప్తి చెందడంతో... చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ అచేతన స్థితిలో కి వెళ్లి పోతున్నారు. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ చుట్టూ ఉన్న గ్రామాల్లో పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారిపోయింది. 

 

 

 చుట్టుపక్కల గ్రామాలలో పూర్తిగా ఈ విష వాయువు వ్యాపించి గాలిలో కలిసిపోవడంతో ఈ విష వాయువులు పీల్చుకున్న ప్రజలు ఎక్కడికక్కడ నురగలు కక్కుకుని   స్పృహ కోల్పోతున్నారు. దీంతో వెంటనే సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకొని ప్రజలందరినీ పోలీసు వాహనాలు అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇక ముఖ్యంగా ఈ విష వాయువు కారణంగా చిన్నపిల్లలు మహిళలు ఎక్కువగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దాదాపు విషవాయువు కారణంగా రెండు వందల మంది అచేతన స్థితిలో కి వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే ఈ విష వాయువు కారణంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. 

 

 

 అయితే ఈ విష వాయువు మరింత మంది ప్రాణాలను బలి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చుట్టుపక్కల గ్రామాల్లోని వందలాదిమంది గ్రామాల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది నిద్దరలోనే  స్పృహ కోల్పోవడంతో వారిని కూడా ఇళ్లలోంచి ఆస్పత్రికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అక్కడికి చేరుకొని రక్షణ చర్యలు చేపడుతున్న పోలీసులు సైతం స్పృహ  కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.అదే  సమయంలో ప్రజలను ఆస్పత్రులకు తరలిస్తున్న అంబులెన్స్ డ్రైవర్ కూడా స్పృహ కోల్పోయాడు. దీంతో విశాఖ లో దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: