విశాఖలో జరిగిన విష వాయువు లీకేజీ ప్రమాదం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. విశాఖ నగరంలో క్రమక్రమంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. విశాఖ నగరంలోని ఆర్ఆర్ వెంకటాపురం లో ఉన్న ఎల్జి పాలిమర్స్ అనే ప్లాస్టిక్ తయారీ కంపెనీ నుంచి ఈరోజు తెల్లవారుజామున విషవాయువు విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ విషవాయువు  చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల మేర వ్యాప్తి చెందడంతో  ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రజల ప్రాణాల మీదికి వచ్చింది. చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విష వాయువులు పీల్చుకోవడం ద్వారా ఎంతోమంది స్పృహ కోల్పోయి ఎక్కడికక్కడ కుప్ప కోల్పోతున్నారు. 

 

 

 ఇక ఈ విషవాయువు క్రమక్రమంగా విశాఖలో డేంజర్ బెల్స్  మోగిస్తోంది అని చెప్పాలి. విషవాయువు కారణంగా పచ్చని చెట్లు అన్ని పూర్తిగా ఎండిపోయాయి. ప్రజలందరూ ఎక్కడికక్కడ స్పృహ కోల్పోయారు. కొంతమంది నిద్రలోనే చనిపోతున్నారు. ఇప్పటికే అనధికారికంగా 10 మంది చనిపోయినట్లు సమాచారం. ఇక ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పరిస్థితిని సమీక్షించేందుకు బయలుదేరారు. ఇప్పటికే మంత్రులు ఉన్నత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

 

 

ఈ విషవాయువు బాధితులతో  విశాఖలోని కేజిహెచ్ హాస్పటల్ లో అన్ని పడకలు నిండిపోయాయి. దాదాపు ఇప్పటికే ఈ వైరస్ బారినపడి మూడు వందల వరకు ప్రజలు అస్వస్థతకు గురవ్వగా అంబులెన్స్  ద్వారా వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ లీక్ అయిన గ్యాస్ ఎంత డేంజర్ అంటే... ఇది పీల్చుకుంటే క్షణాల్లో స్పృహ కోల్పోవడమే కాదు.. ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు మహిళలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది ఈ విష వాయువు. దీంతో పిల్లలు అచేతన స్థితిలో కి వెళ్లిపోవడంతో తల్లిదండ్రుల ఆర్తనాదాలతో విశాఖపట్నం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: