విశాఖ వాసులకు పట్టిన దుస్థితి ప్రస్తుతం అందరి మనసులను కలచివేస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కరోనా  వైరస్ తో అందరూ బాధపడుతున్నారు. కనిపించని ఈ మహమ్మారి ఎటు నుంచి వచ్చి దాడి చేసి ప్రాణాలను హరించుకుపోతుందో  అని  ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దినదినగండంగా బతుకును వెళ్లదీస్తున్నారు. ఇలాంటి సమయంలో విశాఖ వాసులను మరో రూపంలో మృత్యువు కబళించింది. నిద్రలో నుంచి నిద్రలోకి జారుకొని... వారికి తెలియకుండానే వారి ప్రాణాలు నిద్రలోంచి నిద్రలోనే పోయే దుస్థితి వచ్చింది విశాఖ వాసులకు. తాజాగా ఆర్ ఆర్ వెంకటాపురం పరిధిలోని ఎల్జీ పాలిమర్స్ అనే ప్లాస్టిక్ కంపెనీ  నుంచి ఈరోజు తెల్లవారుజామున భారీ మొత్తంలో లీకైన విషవాయువులు కారణంగా విశాఖ నగరంలోని పలు గ్రామాలు మృత్యువుతో పోరాడుతున్నాడు

 

 ఇప్పటికే ఈ విష వాయువు కారణంగా చాలామంది కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. తెల్లవారుజామున అందరూ మంచి నిద్రలో ఉన్న సమయంలో విషవాయువు ఒక్కసారిగా లీకై  దాదాపు మూడు కిలోమీటర్ల మేర చుట్టుపక్కల వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ నిద్ర లోంచి అపస్మారక స్థితిలోకి జారుకున్నారు... ఆ తర్వాత కొంతమంది అపస్మారక స్థితి నుంచి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇక చిన్న పిల్లలు మహిళల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది... చిన్నపిల్లలు ఈ విష వాయువులు పీల్చుకోవడం ద్వారా నోట్లోంచి నురగలు కక్కుతూ అచేతన స్థితిలో కి వెళ్ళి పోతున్నారు. దీంతో తల్లిదండ్రులందరూ బోరున విలపిస్తున్నారు.

 

 ఇక ఈ విష వాయువు ప్రభావం అటు మహిళలపై కూడా ఎక్కువగానే చూపిస్తుంది. ఇప్పటికే దాదాపు 200 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.వారి  పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రాణ నష్టం కూడా భారీగానే జరగనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే కరోనా  మహమ్మారి తో బెంబేలెత్తిపోతున్న ప్రజానీకానికి ఈ పాయిజన్ గ్యాస్ ద్వారా ప్రాణాల మీదికి వచ్చింది అని చెప్పాలి. విశాఖ వాసులు అందరిని ఊహించని విధంగా మృత్యువు కబళించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: