కరోనా వైరస్ డ్రగ్ విషయంలో అనేక పరిశోధనలు జరుపుతున్న సమయంలో కరోనా డ్రగ్ క‌నుగొన్న‌ట్టుగా అధికారికంగా మొదట ప్రకటించిన దేశం ఇజ్రాయెల్. మార్చి నెల రెండవ వారంలో నుండి ఇజ్రాయెల్ ఈ ప్రకటన చేయడం జరిగింది. అప్పట్లో ఆ మందు ఎంతవరకు పనిచేస్తుందో అన్న దాని విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. అయితే ఆ డ్రగ్ ఇటీవల ప్రయోగించి వైరస్ నుండి విముక్తి పొందడమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేని మందుగా పనిచేస్తున్నట్లు కుదిరితే వ్యాక్సిన్ రూపంలో కూడా తీసుకు రాబోతున్నట్లు ఆ దేశం ప్రకటించింది. మనుషులలో ఉన్న వైరస్ ను చంపేసే యాంటీబాడీస్ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఇటీవల ల్యాబ్ లోనే  సృష్టించడంతో ఈ వార్త సంచలనం అయింది. వైరస్ ప్రభావం తగ్గించే యాంటీబాడీస్ తయారీలో ఇజ్రాయెల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇజ్రాయెల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్ రీసెర్చ్ సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు.

 

వైరస్ సోకిన వ్యక్తి ఈ యాంటీ బాడీస్ ద్వారా సమగ్రంగా ఎదుర్కోవచ్చు అని అంటున్నారు. ప్రయోగం సక్సెస్ ఫుల్ గా పూర్తి కావడంతో విజయవంతమవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు తయారు చేయడానికి ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా ఇజ్రాయిల్ దేశం లో ఎవరికైనా కరోనా సోకిందని, నిర్ధారణ అయితే ముందుగా వారి రక్త నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలు చేసి అప్పుడు ఆ రక్తంలో యాంటీబాడీస్ ఉంటే క‌రోనా సోకింద‌ని నిర్ధారిస్తూ ఉన్నారు.

 

ఈ నిర్ధార‌ణ జ‌రిగితే, ఆ త‌ర్వాత స‌లైవా త‌దిత‌ర ప‌రీక్ష‌లతో నిర్ధారిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ మంత్రి  చెప్పుకొచ్చారు. కానీ క్లినికల్ ట్రయల్స్ పూర్తయినట్లు చెప్పిన ఇజ్రాయెల్, మనుషులపై  ప్రయోగించినట్లు అధికారికంగా ప్రకటించలేదు. అంతర్జాతీయ మీడియా సంస్థ కూడా ఇదే చెబుతుంది. ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయి అని చెబుతున్న వాటిని మనుషులపై ప్రయోగించారో లేదో అన్న దాని విషయంలో ఆ దేశం క్లారిటీ ఇవ్వడం లేదని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: