ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమం కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ప్రజా శ్రేయస్సు కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అయినా వెనుకాడడం లేదు. మామూలుగానే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం ఏదైనా ఉంది అంటే అది మద్యం ద్వారానే అని చెప్పవచ్చు. కాని మద్యం ద్వారా ప్రజలు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు అనే ఉద్దేశంతో... ప్రభుత్వానికి ఆదాయం కాదు ప్రజల సంక్షేమం ముఖ్యం అన్న సంకల్పంతో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ముందుకు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే  సంపూర్ణ మద్యపాన నిషేధం లో కీలక అడుగులు కూడా వేసింది ఏపీ సర్కార్. 

 

 

 బార్ల సంఖ్యను తగ్గించడం మద్యం షాపులను ప్రభుత్వం నడపడం అంతే కాకుండా భారీ మొత్తంలో మద్యం షాపుల సంఖ్యను తగ్గించడం మద్యం ధరలు భారీగా పెంచడం లాంటివి చేశారు. తద్వారా సామాన్య ప్రజలకి మద్యం అందుబాటు ధరలో లేకుండా ఉండేలా సామాన్య ప్రజలు మద్యం బారిన పడకుండా ఉండేలా చేసేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. అంతే కాకుండా మద్యం షాపుల పని వేళలు కూడా కుదించిన  విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో కూడా అదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. 

 

 

 ప్రస్తుతం కరోనా  వైరస్ కారణంగా రాష్ట్రంలో ఏకంగా 40 రోజులకు పైగా లాక్ డౌన్ అమలైన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా అన్ని పరిశ్రమలు మూసి వేయడంతో రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయింది. అయినప్పటికీ అదే  సంకల్పంతో ముందుకు సాగుతున్నారు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. లాక్ డౌన్  సడలింపు లో భాగంగా మద్యం ధరలను దాదాపు గా 75% పెంచి మందుబాబులు అందరికీ షాక్ ఇస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 శాతం మద్యం షాపులను కుదించేందుకు నిర్ణయించింది జగన్ సర్కార్. అంటే కరోనా  వైరస్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అదే లక్ష్యంతో ముందుకు సాగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: