ఓ వైపు కరోనా మహమ్మారి కేసులు పెరిగిపోతున్నాయి.. ఇది ప్రజలు చేస్తున్న నిర్లక్ష్యం అని అంటున్నారు.  ఫిబ్రబరిలో ఈ కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి ఈ కరోనా చిన్న చిన్నగా పెరుగుతూ వచ్చింది.  కరోనా మహమ్మారి వల్ల దేశంలో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. భారత్‌లో కొవిడ్‌-19 వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు 3,000 కంటే అధికంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 127 మంది ప్రాణాలు కోల్పోయారు.   దేశంలో 3,277 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 62,939కి చేరింది. 

 

ఇదిలా ఉంటే దేశంలో కరోనా లాక్ డౌన్ ఉల్లంఘించిన వారికి ఎన్ని రకాలుగా శిక్షలు విధించినా జనాలకు మాత్రం బుద్ది తెచ్చుకోవడం లేదు.   ఇక తెలుగు రాష్ట్రాల్లో  కరోనా వైరస్ ప్రబలకుండా ఆంక్షలను కఠినతరం చేసిన తెలంగాణ ప్రభుత్వం మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మాస్కులు ధరించకుంటే జరిమానా తప్పదని హెచ్చరించింది. అయినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు. ఇప్పటికే మాస్క్ ధరించని వారికి వెయ్యరూపాయలు జరిమానా కూడా విధించారు.  తాజాగా ఓ బర్త్  డే పార్టీ చేసుకొని 41 మందికి కరోనా అంటించుకున్నారు.  ఇటీవల ఓ స్టోర్ యజమాని బర్త్ డే వేడుకలు నిర్వహించడమే వైరస్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్నారు.

 

కొత్త కేసులు నమోదు కావడమే కాదు, ఎల్బీ నగర్ ఏరియాలో 15 కంటైన్మెంట్ క్లస్టర్లు కూడా ఏర్పడ్డాయి. ఓ షాప్ ఓనరు తన పుట్టిన రోజు పార్టీ చేసుకున్నారు.. అయితే అప్పటికే అతనికి కరెోనా ఉంది.  ఆ వ్యాపారికి తన దుకాణంలో పనిచేసే వ్యక్తి ద్వారా కరోనా సోకింది. ఈ విషయం తెలియక పార్టీలో పాల్గొనడంతో అతడి మిత్రుడికి కూడా కరోనా వ్యాప్తి చెందింది. ఆ విధంగా మొత్తం 45 మంది కరోనా బారినపడ్డట్టు అధికారులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: