వైయస్ జగన్ ఇచ్చిన హామీల లో మద్యపాన నిషేధం అనేది చేయలేడని అప్పట్లో చాలామంది నాయకులు విమర్శలు చేయడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపానం నిషేధం విషయంలో జగన్ డీల్ చేసిన విధానం వస్తున్న ఫలితాలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ముందుగా అధికారంలోకి రావడమే గ్రామాల్లో ఉన్న బెల్టుషాపులు లేకుండా చేయడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా మద్యం దుకాణాలను ప్రభుత్వం ఆధీనంలో నడిచే విధంగా సరికొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంతే కాకుండా మద్యం షాపులు వద్ద ఎవరు త్రాగకుండా జగన్ వ్యవహరించడంతో పాటుగా ఉదయం పది గంటల నుండి రాత్రి ఏడు వరకే షాప్ టైమ్స్ కుదించడంతో చాలావరకు మందుబాబుల ఆలోచనలలో అప్పట్లోనే మార్పులు రావడం జరిగింది.

 

ఒకపక్క ఆర్థికంగా రాష్ట్ర ఖజానా కి నష్టం వస్తున్నా గాని జగన్ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ నెరవేరుస్తూ పోతున్నారు. ఈ మధ్యలో కరోనా వైరస్ రావడంతో దాదాపు 40 రోజుల పాటు మందు బాబులకు మందు లేకపోవటం జరిగింది. లాక్ డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా మందు షాపులు క్లోజ్ అయిపోయాయి. ఇటీవల కేంద్రప్రభుత్వం మూడో దశ లాక్ డౌన్ పొడిగించిన సమయంలో మద్యం షాపులకు మినహాయింపులు ఇవ్వడంతో అన్ని రాష్ట్రాలో కేంద్ర ఆదేశాలు మేరకు మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. ఏపీలో కూడా మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి కానీ మొదటి రెండు రోజులు రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడు పోగా... తరువాత దాదాపు మద్యం విక్రయాలు ఏకంగా 55శాతం పడిపోయాయి.

 

ఇదే సమయంలో జగన్ సర్కార్ మద్యం ధరలు దాదాపు 70% పెంచడం జరిగింది. అయితే వస్తున్న ఫలితాలు అమ్మకాలు చూస్తే చాలా వరకు మద్యానికి అలవాటు పడిన వాళ్ళు తమ ఆలోచనలు మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ తీసుకున్న నిర్ణయాలు మందుబాబులకు మద్యం పై అసహ్యం కలిగించే విధంగా ఉంటున్నాయట. మందు కొనటానికి ప్రస్తుతం సరిగ్గా ఎవరు గతంలో లాగ రావడం లేదట. మొత్తంమీద చూసుకుంటే జగన్ మద్యం నిషేధించే విషయంలో సరిగ్గా డీల్ చేయలేడు అన్న వారికి గట్టిగా దిమ్మతిరిగిపోయే విధంగా నిషేధించడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: