మనిషికి వయస్సు వచ్చిన కొద్ది అతనిలో బుద్ధి వికసించి నలుగురికి ఆదర్శంగా నిలవాలి.. కానీ నేడు సమాజమానికి యువతతో పాటుగా వయస్సు మళ్లిన వృద్ధులు అని చెప్పబడే ముసలి నక్కలు ప్రమాదకరంగా మారుతున్నారు.. యువత అంటే ఆవేశంలో అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుని తప్పులు చేస్తున్నారనుకుందాం.. ఇలాంటి వారికి తమ అనుభవాలను పాఠాలుగా చెప్పి వారి దారిని సక్రమ మార్గంలో మళ్ళించ వలసిన పెద్దలు కూడా దారి తప్పుతున్నారు.. మనసులో చెలరేగే కోరికలను అణచుకోలేక, సమాజంలో వయస్సు రీత్యా వచ్చే పెద్దరికానికి విలువలేకుండా చేస్తున్నారు..

 

 

ఇక్కడ మనం చదవబోయే విషయాన్ని పరిశీలిస్తే.. ఇతని వయస్సు 70 సంవత్సరాలు.. ఈ కామాంధుడు నలుగురు భార్యలకు మొగుడు.. తన జీవితంలో అన్నీ అనుభవించినా ఇంకా ఆశ చావక అమాయకమైన, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న యువతులకు వలవేస్తూ వీడి కామవాంచలు తీర్చుకుంటున్నాడు.. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్న ఈ నీచుడి వివరాలు తెలుసుకుంటే.. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్న మహమ్మద్ సలీం(70)కు ఇదివరకే నలుగురు భార్యలు. వీరంతా విదేశాల్లోనే ఉంటారు. కాగా ఈ మృగం కూడా విదేశాల్లోనే ఉంటూ తరచూ హైదరాబాద్ వస్తుంటాడు.

 

 

ఈ నేపధ్యంలో ఇక్కడకు వచ్చిన ప్రతిసారి పేద అమ్మాయిలకు ఆర్ధికసాయం చేస్తానని నమ్మించి, తాను ఉంటున్న ఇంటికి వారిని పిలిపించుకుని అఘాయిత్యాలకు పాల్పడుతుండడం అలవాటుగా మార్చుకున్నాడు.. కాగా తాజాగా ఓ 23 ఏళ్ళ ఓ యువతిపై కన్నేసిన సలీం... ఆమెను కూడా లొంగదీసుకునే క్రమంలో ఆర్ధికసాయం చేస్తానని చెప్పి ఇంటికి పిలిపించుకుని ఆమెకు తెలియకుండా మత్తు మందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా కాసేపటికి స్పృహలోకి వచ్చిన ఆ యువతి తనపై జరిగిన అఘాయిత్యాన్ని పసిగట్టి వెంటనే పూర్తి ఆధారాలతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించగా ప్రస్తుతం ఈ ముసలి తోడేలుని పోలీసులు అరెస్ట్ చేసారు... అందుకే అమ్మాయిలు మీ నీడను కూడా నమ్మే పరిస్దితులు లోకంలో లేవు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి: