కరోనా  వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో దాదాపు 40 రోజుల పాటు అన్ని రవాణా వ్యవస్థలు పూర్తిగా నిలిచి పోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు  తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి . ఇక ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్ర పరిధిలో పని సడలింపులు  చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు కూడా పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ కీలక చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా అన్ని రాష్ట్రాలు మద్యం ధరలు పెంచి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే పనిలో పడ్డాయి. ఇదే సమయంలో గత 40 రోజుల నుండి రాష్ట్ర  రవాణా వ్యవస్థ లో ముఖ్యమైన... రోడ్డు రవాణా వ్యవస్థ పూర్తిగా మూసివేయబడింది... 

 

 

 అదే సమయంలో ఉద్యోగులకు మాత్రం జీతాలు చెల్లించక తప్పలేదు. ఈ క్రమంలో గత కొంత కాలం నుంచి ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచే అవకాశం ఉందంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఈ వార్తలు మరింత ఎక్కువగా వస్తున్నాయి. లాక్ డౌన్  సడలింపు లో భాగంగా ప్రస్తుతం ఆర్టీసీ చార్జీలు పెంచే అవకాశం ఉంది వస్తున్న వార్తలపై తాజాగా మంత్రి పేర్ని నాని స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి ఆర్టీసీ చార్జీలు పెంచడం లేదు అంటూ తెలిపిన మంత్రి పేర్ని నాని... సామాన్య ప్రజలు అందరికీ ఒక శుభవార్త చెప్పారు అని చెప్పాలి. 

 

 

 ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచాలన్న యోచనలో లేదని... మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొన్ని రోజుల్లో భారీగా ఆర్టీసీ చార్జీలు పెంచుతారు  అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని వాటిని నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దు అని సూచించారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక ఈ నెల 17 వరకు కేంద్ర ప్రభుత్వం విధించిన మూడో విడత లాక్ డౌన్  కొనసాగుతుందని ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ బస్సులు నడపాలని ఆదేశాలు ఇస్తే  కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో రోడ్డు రవాణా వ్యవస్థ  ప్రారంభించి బస్సులు నడుపుతాము  అంటూ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: