చంద్రబాబు వయసు మీద పడటంతో ఏమో తెలియదు గానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు బెడిసి కొడుతున్నాయి. గతంలో తెలుగు రాజకీయాల్లో చాణక్యుడిగా పేరు సంపాదించిన చంద్రబాబుకి ఇప్పుడు ఆయన నిర్ణయాలు ఆయననే అందరి ముందు నవ్వుల పాలు చేస్తున్నాయి. అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడటంతో చంద్రబాబు ఐడియాలు మొత్తం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ విషయంలో చంద్రబాబు నియమించిన త్రిసభ్య కమిటీ చివరాఖరికి ఆయన కొంప ముంచింది. చంద్రబాబు పరువు పోయేలా చేసింది. పూర్తి మేటర్ లోకి వెళ్తే విశాఖపట్టణంలో ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ అయిన ఘటన అనంతరం జరిగిన అన్ని విషయాలు ప్రజలకు తెలిసినవే.

 

దారుణమైన ప్రమాదం జరిగిన తర్వాత ఎనిమిది గంటల లోపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ ప్రాంతంలో పర్యటించడం బాధితులను పరామర్శించడం అందరికీ తెలిసిందే. అదే సమయంలో క్షతగాత్రులకు మరియు మరణించిన వారికి ఎవరూ ఊహించని విధంగా జగన్ నష్ట పరిహారాలు ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ప్రతిపక్షానికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వని జగన్ పై చంద్రబాబు లేనిపోని అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం అందరికీ తెలిసిందే. కోటి రూపాయలు ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ గత్యంతరంలేని పలుకులు చంద్రబాబు పలికారు. ఈ క్రమంలో చంద్రబాబు ఈ ఘటనకు సంబంధించి అన్ని విషయాలు వెలికితీయాలని విశాఖకు పంపిన త్రిసభ్య కమిటీ సభ్యులు బాబుకే షాక్ ఇచ్చే విధంగా వ్యవహరించారు.

 

గతంలో మూడేసి లక్షలు, 10 లక్షలు నష్టపరిహారాలు ప్రకటించి వాటిలో కొన్ని చెల్లించి మరికొన్నిటిని చెల్లించకుండా వ్యవహరించిన చంద్రబాబు కోటి ఇస్తే ప్రాణాలు తిరిగి వస్తాయా అని ప్రకటించిన మరుసటి రోజే, ఈ టీడీపీ త్రిసభ్య కమిటీ మెంబర్స్ ఏకంగా పది రెట్లు ఎక్కువగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వారి ఉద్దేశం ప్రకారం కోటి కాదు 10 కోట్లు ఇస్తే తిరిగి ప్రాణం వచ్చేస్తుంది అన్నట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. ఈ పరిణామ తో చంద్రబాబు పరువు పోయినట్లు అయింది. ఏది ఏమైనా పార్టీ అధినేత ఒక మాట అంటే పార్టీ నాయకులు మరో మాట అనటం బట్టి చూస్తే చంద్రబాబు పార్టీపై పట్టు కోల్పోతున్నట్లు అర్థమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: