కరోనా  వైరస్ గురించి ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినప్పటికీ  కొన్ని కొన్ని సార్లు ప్రపంచ దేశాలకు ధైర్యం నింపేలా  వ్యాఖ్యలు చేస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మొన్నటికి మొన్న ఇప్పట్లో కరోనా  వైరస్ కి వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని.. ఈ మహమ్మారి వైరస్ తో  మరి కొన్నేళ్లు వరకు సహజీవనం తప్పదు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానించడం ప్రపంచ దేశాలను  ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి చేసిన  విషయం తెలుసిందే. 

 

 

 ప్రపంచ వ్యాప్తంగా కేసులన్నీ భారీ రేంజ్ లో పెరిగిపోతున్నాయి. దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన నెలలు  గడుస్తూన్నప్పటికీ ఈ వైరస్కు సరైన విరుగుడు మాత్రం లేకపోవడంతో.... ప్రజలు మరింత ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలకు భరోసా ఇచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలు ఎంతోమందిలో ధైర్యాన్ని నింపుతున్నాయి. 

 

 

 ప్రపంచ మహామ్మరి  అయినా కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ ఎంతో సమర్థవంతంగా పని చేస్తూ ముందుకు వెళుతున్నాయి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీప్ టెడ్రోస్  తెలిపారు. ఈ మహమ్మారి వైరస్ పెద్ద ఎత్తున విస్తరించకుండా... మరణాలు ఎక్కువగా సంభవించకుండా.. ప్రపంచ దేశాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయి అంటూ ఆయన వెల్లడించారు. ప్రపంచ దేశాలు అన్ని సామాజిక దూరాన్ని విజయవంతంగా పాటించడం కారణంగా కరోనా ను  దూరం చేయగలుగుతున్నాయి అంటూ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా కొందరు జీవితాలపై ఆర్థిక సామాజిక ప్రభావం చూపుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: