దేశంలో ఇప్పుడు కరోనా మహమ్మారి వల్ల మనుషులకు మహా చిక్కు వచ్చింది.  రోజు ఓక పుకారు రావడం.. దాంతో హడలిపోవడం జరుగుతుంది. ముందు ముందు కరోనాతో మనం సహవాసం చేయాలని.. కరోనా ఇప్పట్లో తగ్గతని.. కరోనా వల్ల లక్షల మంది మరణిస్తారని ఒక్కటి కాదు ఎన్నో రకాల పుకార్లు పుట్టుకు వస్తున్నాయి. మరోవైపు మన దేశంలో కరోనాపై యుద్దం చేస్తున్నామని.. ఇతర దేశాలతో పోల్చితో మనం చాలా కంట్రోల్ లో ఉన్నామని నేతలు చెబుతున్నారు.  కానీ.. కొన్ని చోట్ల పుకార్లు మాత్రం షికార్లు చేస్తూనే ఉన్నాయి.   

 

తాజాగా ఛత్తీస్ గఢ్‌లో ఉప్పు దొరకదంటూ వచ్చిన పుకారు ఇప్పుడు దావనంలా వ్యాపించింది. ఇది నిజమే అని నమ్మిన అక్కడి ప్రజంతా ఉప్పు దుకాణాలు, కిరాణ షాపుల ఎదుట క్యూ కట్టాల్సి వచ్చింది. చాలా మంది ముందుగానే అధిక ధరలకు బస్తాలకు బస్తాలు  కొనుక్కెళ్లారు. అయతే ఈ విషయం తెలిసిన అధికారులు సత్వర చర్యలు ప్రారంభించారు.  ఎవరో వ్యక్తులు రెండు నెలల పాటు ఉప్పు దొరికే పరిస్థితి లేదని పుకారు పుట్టించారు. ఆ నోట, ఈ నోట అది రాష్ట్రమంతా వ్యాపించింది. ప్రజలంతా పనులు మానుకొని ఉప్పు కోసం క్యూ కట్టాల్సి వచ్చింది. అయితే ఇదంతా అక్రమార్కుల ప్లాన్‌గా అధికారులు గుర్తించారు.  కావాలనే కొంత మంది పుట్టించిన పుకార్లు అని.. దీని వల్ల కొంత మంది వ్యాపారులు బాగా లాభపడుతున్నారని అన్నారు. 

 


అధిక ధరలకు అమ్మి క్యాష్ చేసుకోవాలనే వందంతులు వ్యాపింపజేశారని పేర్కొన్నారు. వెంటనే ఉప్పు డీలర్ల దుకాణాలను తనిఖీలు చేశారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెంద వద్దని, కావాల్సినంత ఉప్పు నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతే కాదు ఎవరైనా అధిక ధరలకు ఉప్ప ఉమ్మినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. కాగా మార్కెట్లోకి ప్రతి నెల 8 నుంచి 10 వేల టన్నుల ఉప్పు వస్తూనే ఉందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: