వైర‌స్‌లను అదుపులోకి తేవ‌డానికి దాదాపు 70రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌న్న‌ది శాస్త్ర‌వేత్త‌ల్లో ఉన్న బ‌ల‌మైన అభిప్రాయం. ఎబోలా స‌హ చాలా ప్రాణాంత‌క వైర‌స్‌ల నిర్మూల‌న‌లో, నియంత్ర‌న‌లో ఇది రుజువైంది. ఇప్పుడు క‌రోనా వైర‌స్ విష‌యంలోనూ భార‌త‌దేశంలో అదే జ‌ర‌గ‌బోతోంద‌ని వైద్య నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు. గ‌తంలో తెలంగాణలో లాక్‌డౌన్ను మే 29 వ‌ర‌కు పొడ‌గిస్తూ సీఎం కేసీఆర్ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ప్ర‌ధాన‌మంత్రి మోదీ కూడా దాదాపు 70రోజుల లాక్‌డౌన్ పొడ‌గింపున‌కు మొగ్గు చూపుతార‌ని కొంత‌మంది అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.


 సోమ‌వారం పీఎంతో జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లోనూ లాక్‌డౌన్ పొడ‌గింపున‌కే ముఖ్య‌మంత్రులు మొగ్గు చూప‌డం గ‌మ‌నార్హం. ఇక తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ ఇది వ‌ర‌కే మే 29వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగించారు. తెలంగాణ‌లో లాక్‌డౌన్ 3 రోజుల ముందుగా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. అందువ‌ల్ల  70 రోజుల నియ‌మం ప్ర‌కారం.. కేసీఆర్ మే 29వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించారు. ఇక సోమ‌వారం మోదీ సీఎంల‌తో జ‌రిపిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లోనూ ఎక్కువ మంది సీఎంలు లాక్‌డౌన్‌ను పొడిగించాల‌నే మోదీని కోర‌గా, ప్ర‌ధాని కూడా ఇదే సూత్రాన్ని లాక్‌డౌన్‌కు అన్వ‌యిస్తార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. 


అదే జ‌రిగితే దేశంలో జూన్ 2వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌లులో ఉంటుంద‌న్న‌మాట‌. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగ‌ళ‌వారం రాత్రి 8గంట‌ల‌కు జాతినుద్దేశించి ప్రసంగం చేయనున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై మాట్లాడనున్నారు. ఆయ‌న చెప్ప‌బోతున్నార‌నే దానిపై దేశ ప్ర‌జానీకంలో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండ‌గా  భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 71వేలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 3,604 కేసులు నమోదుకావ‌డం వ్యాధి వ్యాప్తి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. దేశంలో కరోనా కేసులు 70,756కి చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

 


70రోజుల లాక్‌డౌన్ త‌ప్ప‌దా..మోదీ చెప్ప‌బోయేది అదేనా..?

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: