క‌రోనా వైర‌స్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న‌ వుహాన్ న‌గ‌రంపై చైనా అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. చైనా నిర్ల‌క్ష్యం వ‌ల్లే నేడు ప్ర‌పంచానికి ఈ గ‌తి ప‌ట్టింద‌ని అన్ని దేశాలు తిట్టిపోస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా వుహాన్‌లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టం చైనానే కాదు...మిగ‌తా దేశాల‌న్నింటిని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. గ‌డిచిన కొద్ది రోజుల‌ను గ‌మ‌నిస్తే చైనాలో క్ర‌మంగా వైర‌స్ త‌గ్గ‌ముఖం ప‌ట్టి..అంకెల స్థాయికి చేరుకుంది. అయితే అదే క్ర‌మానుగ‌తంగా మ‌ళ్లీ అంకెల్లోంచి పాజిటివ్ కేసులు సంఖ్య‌ల్లోకి చేరుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. 

 

అయితే ఇప్పుడు వుహాన్‌లో పెరుగుతున్న కేసుల‌ను గుర్తించేందుకు చైనా ఏకంగా ఆ ప‌ట్ట‌ణంలోని జ‌నాలంద‌రికీ వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం కార్యాచ‌ర‌ణను కూడా పూర్తి చేయ‌డం గ‌మ‌నార్హం.  ఈ ప‌ట్ట‌ణంలో ఒక కోటీ 10 లక్షల మంది జనాభాకు కరోనా పరీక్షలు నిర్వహించాలని చైనా అధికారులు భావిస్తున్నారు. పది రోజుల్లో  పరీక్షలు పూర్తి చేసి ఫ‌లితాలు వెల్ల‌డించ‌నున్నారు.  కరోనా పాజిటివ్ నమోదైతే వెంటనే చికిత్స ప్రారంభించడానికి ఆసుపత్రులను తిరిగి సిద్ధం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. 

 

 ఏప్రిల్ 8న వూహాన్‌లో లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాతే తిరిగి కేసులు నమోదవుటుండటంతో.. పాక్షికంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండ‌గా  లాక్‌డౌన్ త‌ర్వాత 28 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు న‌మోదు కాని వూహాన్ న‌గ‌రంలో ఇటీవ‌ల ప‌దుల సంఖ్య‌లో కేసులు న‌మోదవుతున్నాయి. క‌రోనా పాజిటివ్ కేసుల‌ను ఆదిలోనే అరిక‌ట్టాల‌ని నిర్ణ‌యించిన చైనా ప్ర‌భుత్వం సాధ్య‌మైనంత మందిని ముందే గుర్తించ‌డం వ‌ల్ల వ్యాప్తిని అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని భావిస్తోంది. అయితే వుహాన్‌లో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌కున్నా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అవుతుండటంతో వూహాన్ నగరవాసుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: