టిఆర్ఎస్  పార్టీకి ప్రధాన ప్రతిపక్షం తామే అన్నట్లుగా బిజెపి వ్యవహరిస్తూ కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విధానాలపై తరచుగా ప్రశ్నిస్తూ, బలం పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. 2024లో ఏదో ఒక రకంగా పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని బీజేపీ నాయకులు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఈ ఈ క్రమంలోనే ప్రజల్లో బలం పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఈ మధ్యకాలంలోనే బాధ్యతలు స్వీకరించిన ఎంపీ బండి సంజయ్ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన పై పోలీసులు కేసు నమోదు చేయడం వైరల్ గా మారింది . 

 
 
దీనికి కారణం మంగళవారం బండి సంజయ్ నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలోనే నాగార్జునసాగర్ పర్యటించిన ఆయన ఆ జిల్లాలోని పెద్దవూర మండలం ఊట్ల పల్లె లోని బత్తాయి రైతులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  పెట్టుబడులు కూడా రాకపోవడంతో తామంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు సంజయ్ కు తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రభుత్వం బత్తాయిలను కొనుగోలు చేయాలని, రైతులు ఎవరు నష్టపోకుండా కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై అనేక విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
 
నిబంధనలు ఉల్లంఘించడం కాకుండా, సామాజిక దూరం పాటించకుండా ఆయన వ్యవహరించారని, పెద్దవూర పోలీసులు ఆయనపై లాక్ డౌన్ నిబంధన  ఉల్లంఘన కేసు నమోదు చేశారు. దీనిపై తెలంగాణ బిజెపి నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటే తమ పైన కేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బిజెపి నాయకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: