వైసీపీ పార్టీలో ముందు నుండి నెల్లూరు జిల్లాలో జగన్ కి అండగా ఉంటున్న ఇద్దరు నాయకులు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మరొకరు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళద్దరి మధ్య పదవి కోసం తీవ్ర పోరు కొనసాగుతోంది. జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉండే ఈ నాయకులు గత సంవత్సరం జరిగిన ఎలక్షన్ లో గెలిచిన తర్వాత మంత్రి పదవి పై కన్ను వేయడం జరిగింది. కానీ అనూహ్యంగా మంత్రివర్గంలో ఒక బీసీ కి మరియు మరొక రెడ్డికి జగన్ నెల్లూరు జిల్లా నుంచి మంత్రి పదవులు ఇచ్చారు. కాగా  మంత్రి పదవులు పొందిన ఇద్దరు..జిల్లాలో జూనియర్లు కావటం గమనార్హం. ముఖ్యంగా తమ కంటే లేటుగా రాజకీయాల్లో అడుగు పెట్టిన వారికి వైసిపి పార్టీ మంత్రి పదవులు ఇవ్వటాన్ని ఈ ఇద్దరు సీనియర్ నాయకులు తో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్న మరి కొంతమంది సీనియర్ నాయకులు తట్టుకోలేక పోతున్నారు అని వైసీపీ పార్టీలో టాక్.

 

మరో ఏడాదిన్నర లో మంత్రి వర్గం విస్తరణ ఉంటుందని అప్పుడైనా సంపాదించవచ్చు మంత్రి పదవి అని ఇద్దరు నేతలు తమ అనుచరులతో చెప్పుకుంటూన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి అయితే ఇద్దరు నాయకులతో పాటు ఆనం వంటి సీనియర్ నాయకుడు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత వైఎస్ ముఖ్యమంత్రి హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. అయితే ఈయనకు మంత్రిపదవి అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని జిల్లా రాజకీయాల్లో టాక్. ఇటువంటి సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మరియు ప్రసన్నకుమార్ రెడ్డి ఎలాగైనా మంత్రి పదవి ఈసారి సాధించాలని జగన్ ఏదో ఒకరోజు ఓకే చెప్పడం గ్యారెంటీ అనే ఆలోచనలో ఉంటూ ప్రయత్నాలు చేస్తూ ఎదురు చూస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: