తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా ఏమి పోషించకుండా అక్కడి నుండే వ్యవహారాలన్నీ చక్కబెడుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులతో నే కాలక్షేపం చేస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ లోనే ఉన్న చంద్రబాబు తెలంగాణ రాజకీయ వ్యవహారాల్లో మాత్రం జోక్యం చేసుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పై చంద్రబాబు గాని తెలంగాణ టిడిపి నాయకులు గానీ స్పందించడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న టైంలో హైదరాబాదులోని టిడిపి ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ రోజు కళకళలాడుతూ ఉండేది.

 

తెలంగాణ లో ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మూసివేత లో ఉంది. రమణా లాంటి నాయకులు ఒకరిద్దరు మినహా తెలంగాణలోని టీడీపీ పార్టీలో మహామహులు చాలావరకు టిఆర్ఎస్ - బిజెపి పార్టీలలో చేరిపోయారు. ఈ దెబ్బతో తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు ముద్దాయిగా ఉన్న ఓటుకు నోటు కేసు తర్వాత గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు ఎక్కువగా ఉండే కుక్కట్ పల్లి ప్రాంతం స్థానం నుంచి దివంగత నందమూరి హరికృష్ణ కూతురు నీ పోటీలోకి దింపి చంద్రబాబు భంగపడ్డారు. అప్పటి నుండే తెలంగాణాలో టిడిపి తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఏపీలో అధికారంలో ఉన్న వైయస్ జగన్ ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన వెంటనే టిడిపి నాయకులు వైసీపీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

 

అయితే తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ రెండు రోజుల తర్వాత మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాల ముందు కంటే తెలంగాణలో భయంకరంగా జనాలు ఏగబడిన పరిస్థితి ఏర్పడింది. అయినా కానీ చంద్రబాబు తెలంగాణలో ఉన్న ఎటువంటి స్పందన విమర్శ చేయలేకపోయారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వం పై విమర్శలు చేయడానికి చంద్రబాబు భయపడుతున్నారు అన్న టాక్ తెలుగు రాజకీయాల్లో నడుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి దగ్గర్లోనే ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: