ఇండియాలో కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ వలన వైరస్ కంట్రోల్ అయిన సందర్భాలు లేవు. ఇప్పటికి మూడు సార్లు లాక్ డౌన్ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం నాలుగోసారి లాక్ డౌన్ పొడిగించాలా లేకపోతే వదిలేయాలా అన్న దాని విషయంలో క్లారిటీ లేకుండా ఉన్నట్లు సమాచారం. లాక్ డౌన్ ఉంచితే దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా చాలా నష్టపోతున్నాయి. మరోపక్క ఇంటిలోనే ఉంటున్నా పేద మరియు మధ్యతరగతి ప్రజల జీవితాలు ప్రమాదంలో పడినట్లు అవుతుంది. ఒకవేళ ఎత్తేస్తే మళ్లీ వైరస్ భయంకరంగా విజృంభించే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.

 

ఇదే సమయంలో రోజురోజుకీ వేల సంఖ్యలో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరోపక్క ప్రపంచంలో మొదటిలో కేసులు తగ్గటంతో లాక్ డౌన్ తొలగించిన దేశాలలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లు దీంతో లాక్ డౌన్ అమలు చేయడానికి ఆయా దేశాలు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో శాస్త్రవేత్తలు వాక్సిన్ కోసం చేస్తున్న పరిశోధనలు ఈ సంవత్సరం రిజల్ట్ వచ్చే అవకాశం లేదని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.

 

ప్రస్తుతం ఇండియాలో మూడో దశ లాక్ డౌన్ ఈనెల 17వ తారీకు తో ముగియనుంది. ఈ దశలో రాష్ట్రాలలో ఉన్న కొద్ది వైరస్ కేసులు బయట పడుతున్న తరుణంలో స్పష్టమైన నిబంధనలతో ఆంక్షల సడలింపు తో లాక్ డౌన్ నాలుగో దశ చేపడుతూనే మరోపక్క ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా నిర్ణయాలు కేంద్రం తీసుకుంటున్నట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే దేశంలో నాలుగో దశ లాక్ డౌన్ అమలు చేయటానికి కేంద్రం ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: