తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుకూల మీడియా ఎంత హడావుడి చేసినా, తెలుగుదేశం పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదని, ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉంది అంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. చంద్రబాబు వాస్తవాలను కప్పిపుచ్చి అసత్యాలను తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తూ, రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, అయినా వారి మాటలను నమ్మే  పరిస్థితుల్లో ప్రజలు ఎవరూ లేరు అని మంత్రి విమర్శించారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమర్థవంతంగా పని చేస్తున్నారని,  ప్రజల్లో ధైర్యం నింపేందుకే మంత్రులు సైతం గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ఒకరోజు బస చేశామని, ఎప్పటికప్పుడు గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి జగన్ తెలుసుకుంటూ సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని , అయినా టీడీపీ అనుకూల మీడియా అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

IHG


 ఇంకా గ్రామాల్లో విషవాయువులు ఉన్నాయంటూ ఈనాడు పత్రిక అసత్య కథనాలను ప్రచురించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందని, ఆ వార్తలను ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ జూమ్ పార్టీ గా  మారిందని బొత్స విమర్శించారు. చివరికి ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడిన మాటల్లోని ఒత్తులు , పొల్లులు ఆధారంగా విమర్శలు చేసే స్థాయికి తెలుగుదేశం పార్టీ దిగజారి పోయిందని విమర్శించారు. చంద్రబాబు పక్క రాష్ట్రానికి వెళ్లి తల దాచుకుంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ జూమ్ యాప్ లో మాట్లాడుతూ తమను ప్రశ్నించడం ఏంటని ప్రశ్నించారు.

IHG


 టిడిపి నాయకులు అంతా ఇళ్ళల్లో దాక్కుని వైసిపి చేస్తున్న సహాయం పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, రాష్ట్రం పై లక్షల కోట్ల అప్పులు వదిలివెళ్లిన టిడిపి ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు అంటూ మంత్రి బొత్స తీవ్రస్థాయిలో మండిపడ్డారు.చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఎవరూ లేరని వాస్తవాలు ఏంటో ప్రజలకు బాగా తెలుసునని బొత్స విమర్శించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: