వారు నరనారాయణులు. ఒకరు క్రిష్ణుడైతే. మరొకరు అర్జునుడు. ఇద్దరూ కారణ జన్ములే. రణ జన్ములే. ఈ ఇద్దరూ ఇద్దరే. ఎదురులేని వారే. తిరుగులేని బాణాలే. ఇద్దరి మధ్య నెయ్యం ఉంటే చూసేందుకు బాగుంటుంది. కానీ కాదని కయ్యానికి సిధ్ధపడితే  ఏడేడు లోకాలు బెంబేలెత్తిపోవాల్సిందే.

 


ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేసీయర్, జగన్ ఇద్దరూ సాటి లేని మేటి నేతలే. ఈ ఇద్దరూ కలసి ఉంటే చూడడానికి  రెండు కళ్ళూ చాలలేదు తెలుగు జనాలకు, ఏడాది పాటు ఆ స్నేహం ఆలా సక్సెస్ ఫుల్ గా  కొనసాగింది. ఇపుడు జల జగడం మొదలైంది. ఎవరూ వెనక్కి తగ్గరు.  అందులో ఒకరు రాయ‌లసీమ కోసం ప్రాణమైనా ఇచ్చే ముఖ్యమంత్రి అయితే మరొకరు తెలంగాణానే తెచ్చిన ఉద్యమ నేత మరొకరు.  దాంతో ఈ నీటి కయ్యం ఎటువైపు దారితీస్తుందని రెండు తెలుగు రాష్ట్రాలే కాదు జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఉత్కంఠగా ఉంది.

 

ఎందుకంటే కేసీయార్ మొండితనాన్ని  మొత్తం భారతదేశం చూసింది. అదే విధంగా జగన్ పట్టుదలను కూడా అదే దేశం చూసింది. ఇద్దరూ అడుగులు ముందుకు వేసేవారు కానీ ఎక్కడా కూడ వెనక్కి తగ్గరుగా. ఇక రాయలసీమ బిడ్డగా జగన్ ఆ ప్రాంతం  కోసం ఏమైనా చేసేందుకు రెడీ. తెలంగాణా తెచ్చిన కేసీయార్ కూడా నీటి కోసం యుధ్ధమే చేస్తారు. ఇదే ఇపుడు దేశంలో అతి పెద్ద టాపిక్ గా ఉంది.

 

ఇదిలా ఉండగా జగన్ తన వాదన తాను వినిపిస్తున్నారు. వరద నీరుని, మిగులు జలాలను ఉపయోగించుకుకోవడం కోసమే పోతిరెడ్డిపాడు  ఎత్తిపోతల పధకాం ఎత్తు పెంచుతున్నట్లుగా చెప్పుకొస్తున్నారు. మరో వైపు చూస్తే చుక్క నీరు కూడా ఏపీకి ఇచ్చేది లేదని తెలంగాణా పట్టుదల మీద ఉంది. అక్కడ విపక్షాలు నానా యాగీ చేస్తూ కేసీయార్ మీద వత్త్తిడి పెంచుతున్నాయి.

 

మరి ఈ వత్తిడితో అటు జగన్, ఇటు కేసీయార్ రాజకీయ రణానికి సిధ్ధపడతారా. అది ఎంతదాకా వెళ్తుంది. ఎంతకాలం కొనసాగుతుంది. ఇదే ఇద్దరి మధ్యన స్నెహాన్ని బీటలు వారుస్తుందా అన్నది కూడా పెద్ద ప్రశ్నగా ఉంది. చూడాలి మరి ఈ ఇద్దరి యుధ్ధం రాజకీయంగా ఎటువంటి ప్రకంపనలు రేపనున్నాయో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: