పోతిరెడ్డి ప్రాజెక్టుతో అదనపు నీటిని వినియోగించుకునేందుకు జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో పై తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా ఎవరు నోరు మెదపలేదు. అసలు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ వైపా లేకపోతే తెలంగాణ వైపు అనేది తేల్చుకోలేక పోతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు అసలు గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని వైసిపి పార్టీ నాయకుల నుండి విమర్శలు సెటైర్లు వినబడుతున్నాయి. ప్రస్తుతం మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ 70 శాతం పూర్తి చేశామని ఏపీలో మిగతా ప్రాజెక్టులు కూడా తమ పుణ్యమే అన్న విధంగా చెప్పుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ఏపీ ప్రభుత్వంపై ఈ విషయంలో మండిపడుతున్నారు.

 

దీంతో దేవినేని ఉమా కి షాక్ ఇచ్చే విధంగా జగన్ అనిల్ కుమార్ యాదవ్ ఫుల్ పవర్ తెచ్చాడు అనే టాక్ పార్టీలో వినబడుతుంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల విషయంలో అసలు ఏం జరిగిందో అన్న పాయింట్ పై ఉమా ని టెక్నికల్ గా ప్రూఫ్స్ తో సహా ఓడించాలి అని జగన్ కోరినట్టు సమాచారం. దీంతో  ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యారు. తప్పుడు మాటలు మరియు చేతగాని పనులు రాజకీయాలు చేసేది చంద్రబాబు మరియు దేవినేని ఉమా అంటూ చాలా ఘాటుగా విమర్శలు చేశారు.

 

అంతేకాదు ఈ సమయంలో సీరియస్ ఛాలెంజ్ కూడా విసిరారు. టీడీపీ హయాంలో పోలవరం 70శాతం పూర్తి చేసి ఉంటే, ఆ విషయాన్ని నిరూపించాలని అప్పుడు తను మీసం తీసేసి నెల్లూరు రోడ్లపై తిరుగుతానని, అలా నిరూపించలేకపోతే విజయవాడ రోడ్లపై ఉమా మీసం లేకుండా తిరగాలని సవాల్ విసిరారు. తన సొంత జిల్లాకు చెందిన పులిచింతల ప్రాజెక్ట్ లో కూడా నీరు నింపుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉమా మంత్రిగా పనిచేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రంలో నీటిపారుదల వ్యవస్థ దారుణంగా ఫెయిల్ అయిందని విమర్శించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: