ఉన్నది ఒక్కటే  క్రిష్ణా నది. దానికి పై నున్న రాష్ట్రాలను దాటుకుని నీరు దిగువకు రావడమే కష్టం. ఆ వచ్చిన నీటిని ఉమ్మడి ఏపీలో ఏకమొత్తంగా పంచుకునేవారు. ఇపుడు రాష్ట్రం రెండు ముక్కలు అయింది. అయిదేళ్ళ చంద్రబాబు పాలనలో అయితే ఏమో కానీ ఇపుడు జగన్ అధికారంలోకి వచ్చారు. జగన్ పక్కా రాయలసీమ మనిషి.

 

కేసీయార్ తెలంగాణా నినాదం ఎంత బలంగా వినిపిస్తారో జగన్ అంతే గట్టిగా రాయలసీమ స్వరం వినిపిస్తారు. అయితే కేసీయర్ లా జగన్ ఉపన్యాసాలు ఇవ్వరు. మీడియా మీట్లు పెట్టరు. కానీ తాను అనుకున్నది కామ్  గా చేస్తారు. ఇపుడు 203 జీవో అందులోనిదే. పోతిరెడ్డిపాడు ఎత్తి పోతల పధకం ఎత్తుని పెంచుతూ వరద నీటిని రాయలసీమ జిల్లాలకు పారించేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు.

 

దీని మీద తెలంగాణా ఇంజనీర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారుట.  శ్రీశైలం రిజర్వాయర్ నీటిని కాదు ఏకంగా క్రిష్ణా నీటినే పైపులేసి నీరంతా ఖాళీ చేసేలా పంపింగ్ స్కీమ్ ను జగన్ ప్రభుత్వం డిజైన్ చేసుకున్నట్లు తెలంగాణ ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు.  కృష్ణ నదిలోనే పంప్ హౌస్ ఏర్పాటు చేసి శ్రీశైలం వరకు నీరు రాకుండా తరలించుకునేందుకు పధకం వేసిన్నట్లు ఆరోపణలు చెలరేగుతున్నాయి.

 

దీంతో రిజర్వాయర్ లో నీరు నిండకుండానే ఏపీ సర్కార్ నీరు తీసుకుపోతోంది అని అంటున్నారు. సరే కేసీయార్ కూడా దీని మీద మాస్టర్ ప్లాన్ తోనే ఉన్నారని అంటున్నారు. ఆయన ఏకంగా జూరాల వద్ద మరో కొత్త ప్రాజెక్ట్ కి కేసీయార్ రెడీ అవుతున్నారుట. ఈ ఎత్తిపోతల పధకం ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని తెలంగాణాకు తరలించుకుపోవడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు. అంటే క్రిష్ణా నది లోని  నుంచి నేరు గానే నీటిని కేసీయర్ సర్కార్ తయారు అవుతోందన్న మాట.

 


ఇలా ఎవరికి వారు కొత్తగా ఎత్తిపోతల పధకాలు చేపడితే శ్రీశైలం ప్రాజెక్ట్ లో అసలు చుక్క నీరు అయినా మిగులుతుందా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా ఇద్దరు మిత్రుల మధ్య క్రిష్ణ నీరు గొప్ప యుధ్ధాన్ని తెచ్చిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: