ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పార్టీలతో పాటు మీడియా ప్రమేయం కూడా చాలా ఎక్కువ. వార్తా పత్రికలు మీడియా ఛానల్ లు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాయని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి మీడియా పరంగా చూసుకుంటే ముందు నుండి తక్కువ మద్దతు ఉంది. ఇక టీడీపీ గురించి మాట్లాడితే ఆ పార్టీకి మీడియా మద్దతు ముందు నుండి చాలా ఎక్కువ. దీంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం పై ప్రతిపక్ష పాత్ర టీడీపీతో పాటు కొన్ని మీడియా ఛానల్స్ పోషిస్తున్నాయి. జగన్ చేసిన ప్రతి పనిని వ్యతిరేకంగా ప్రజలకు చిత్రీకరిస్తూ ఎలాగైనా ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోపక్క వైసీపీ కూడా సదరు చానల్స్ తో గట్టిగానే పోరాడుతుంది.

 

ఇదిలా ఉంటే గతంలో చంద్రబాబు హయాంలో ఓ వెలుగు వెలిగిన టీవీ ఛానల్ జగన్ మీద మరియు ఆయన ప్రభుత్వం మీద మొన్నటిదాకా భయంకరమైన విమర్శలు చేస్తూ వచ్చింది. అయితే ఇటీవల జగన్ తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియా ఛానల్స్ విషయంలో ప్రభుత్వపరంగా ఇచ్చే యాడ్ ల విషయంలోనూ కోతలు పెడుతూ రావటంతో సదరు మీడియా ఛానల్ కి ఒక్కసారిగా దిమ్మతిరిగిపోయింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూసి అంతంత మాత్రంగా ఉంది. అదే విధంగా నాయకులు కూడా వెళ్ళిపోతున్నారు. మరోపక్క ఛానెల్ కి ఏమాత్రం రాబడి రావడంలేదని సడన్ గా యూటర్న్ తీసుకుంది.  మొన్నటిదాకా జగన్ కి వ్యతిరేకంగా న్యూస్ కథనాలు ప్రసారం చేసిన ఈ ఛానల్ తన వైఖరి మార్చుకున్నట్టుగా కథనాలు బట్టి అర్థమవుతుంది.

 

ఈ ఛానల్ లో మొన్నటి వరకు జగన్ తుగ్లక్, అహంకారం ఎక్కువ, పెద్దలంటే గౌరవం లేదు అని వార్తలు ప్రసారం చేయగా,  ఇప్పుడు  జగన్ దూరద్రుష్టి కలిగిన నాయకుడని, జగన్ ఏపీ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా, చాలా మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టారని పొగుడుతుంది. కరోనా సమయంలో జగన్ అందరికంటే భిన్నంగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారని, తెలివైన రాజకీయ నాయకుడు అని, జగన్ తాను నమ్మిన దానికి కట్టుబడి ఉండే వ్యక్తి అని, ఇలా అదేపనిగా కొద్ది రోజులుగా ఈ టీడీపీ అనుకూల మీడియా కథనాలు ప్రచారం చేస్తోంది. దీంతో ఈ వార్తలు చూసి జనాలు ఏంటి ఈ ఛానెల్ అలా మారిపోయింది, యూ టర్న్ తీసుకుంది అని షాక్ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: