విశాఖపట్టణంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి గ్యాస్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లాక్ డౌన్ సమయములో ప్రజలంతా ఇంటికే పరిమితమైన సమయంలో తెల్లవారుజామున అందరూ నిద్ర పోతున్న సమయంలో గ్యాస్ లీక్ అవడంతో చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. నిద్రలో ఉన్న వారు నిద్రలోనే స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటనలో 12 మంది చనిపోగా వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. అటువంటి ఈ భయంకరమైన దుర్ఘటన పై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఈ విషయంలో మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం అందరికీ తెలిసిందే.

 

 

అయితే ఈ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న స్థానిక ప్రజలు కంపెనీ పై దాడికి పాల్పడటం మరియు ఆందోళనలు నిరసనలు చేయడంతో పరిస్థితి పూర్తిగా ఇప్పుడు మారిపోయింది. అసలు ఘటన ఎందుకు జరిగిందన్న దానిపై ప్రభుత్వాలు విచారణ చేస్తుండగా మరో పక్క అటు తిరిగి ఇటు తిరిగి ప్రభుత్వాలకు ఎల్జి పాలిమర్స్ కంపెనీ షాక్ ఇచ్చింది. అదేంటంటే నిబంధనలను అనుసరించి కొన్ని దశాబ్దాల క్రితమే నగరం పొలిమేరల్లో ఈ కంపెనీ నిర్మించడం జరిగింది. కంపెనీ నిర్మించిన తరువాత చుట్టుప్రక్కల ప్రజలు నివాసాలు ఏర్పరుచుకున్నారు.

 

అయితే ఈ విషయంలో చాలా వరకు కంపెనీ ఎల్జి పాలిమర్స్ తప్పు లేదని చాలామంది అంటున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ నుండి నష్టపరిహారం వసూలు చేయడానికి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును తప్పు పడుతూ ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోపక్క జగన్ ప్రభుత్వం ఇప్పటికే బాధితులకు నష్టపరిహారం చెక్కుల రూపంలో నేరుగా ఎకౌంట్లోకి వేయడం జరిగింది. ఈ సమయంలో ప్రభుత్వాలు ఎల్జీ పాలిమర్స్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై ఎలా స్పందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: