పాకిస్థాన్ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి . దేశ ప్రధానిగా ఒకరు ఎన్నుకోబడతారు. కానీ అసలు సంగతేమిటంటే.. ప్రధానమంత్రి కి మాత్రం  ఎలాంటి అధికారాలు ఉండవు.. కేవలం సైన్యం, అధికారులు, ఐఎస్ఐ .. చెప్పిన విధంగా ప్రధాన మంత్రి నడుచుకోవాల్సి ఉంటుంది. వాస్తవంగా అయితే వారి ఇష్ట ప్రకారమే ఈ ఎన్నిక కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఎవరు భారతదేశాన్ని పై ఎక్కువగా విమర్శలు చేస్తారో  వారిని ఆ దేశ ప్రధానమంత్రి చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ను త్వరలో అధికారం నిండి దించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. 

 

 ఎందుకంటే ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిస్థితులు.. కరోనా  వైరస్ ప్రభావం దృశ్య పాకిస్తాన్  తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి.. గోధుమల కోసం ఏకంగా విదేశాలకు విజ్ఞప్తి  చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో జనజీవనం మొత్తం స్తంభించి పోతుంది. అయితే అటు ప్రజల్లో  కూడా ఇమ్రాన్ పై  కాస్త వ్యతిరేకత పెరిగి పోతు  ఉంది. అయితే అటు సైన్యానికి ఇమ్రాన్ ఖాన్ కి మధ్య రోజురోజుకు గ్యాప్  పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో సైన్యం తమకు కొత్త నాయకున్ని  తయారు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

 


 ఈ క్రమంలోనే గత కొంతకాలంగా భారతదేశం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ విధానాలను తప్పుబడుతూ.. ఎప్పుడు వివాదం  సృష్టిస్తున్న షాహిద్ ఆఫ్రిది ని  తమ  కొత్త నాయకుడిగా ఎన్నుకున్నారు అనడంలో సందేహం లేదు. అయితే తాజాగా సైన్యం తమకు 20% జీతాలు పెంచాలంటూ ప్రధానమంత్రి ఇమ్రాన్ ను కోరింది. అంటే ప్రస్తుతం పాకిస్థాన్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఎలాగూ ఇమ్రాన్ ఖాన్ సైన్యం జీతాలు పెంచరు కాబట్టి సైన్యంలో అసంతృప్తి చెంది ఇమ్రాన్ ఖాన్ ను గద్దె దించడం సులభం అవుతుందని భావించి ప్రస్తుతం ఈ డిమాండును తీసుకొచ్చింది. మరి ఈ సమస్యను ఇమ్రాన్ ఖాన్ ఎలా ఎదుర్కొంటారు అన్నది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: