ప్రపంచంలో కరోనా వైరస్ ప్రతి దేశంలో ఎంటర్ అయిన సందర్భంలో ఉగ్రరూపం ఒక్కసారిగా దాల్చి అనేక మంది ప్రాణాలను బలితీసుకుంది. యూరప్ మరియు అమెరికా దేశాలలో ఈ విధంగానే కరోనా వైరస్ విజృంభించడంతో వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇటలీ మరియు స్పెయిన్ దేశాల లో అయితే చైనా దేశం కంటే దారుణంగా మరణాలు సంభవించడం తో ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ అయి పోయింది. ఆ తర్వాత అగ్రరాజ్యం అమెరికాలో ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో కరోనా వైరస్ విజృంభించిన తీరు చూసి చాలామంది ప్రపంచ పటంలో అమెరికా కనుమరుగవడం గ్యారెంటీ అని అందరూ అనుకున్నారు.

 

ధనిక దేశం మరియు అత్యాధునిక టెక్నాలజీ కలిగిన అమెరికా కరోనా వైరస్  విషయంలో ఎదుర్కొనే సమయంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొని అనేక మంది ప్రాణాలను  చెల్లించుకోవాల్సి వచ్చింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ ని చాలావరకు సిల్లీగా తీసుకోవటంతో ప్రజలు కూడా కరోనా వైరస్ నీ సరిగా పట్టించుకోకపోవడంతో అమెరికాలో కరోనా వైరస్ భయంకరంగా విజృంభించింది. ప్రస్తుతం కొద్దికొద్దిగా వైరస్ కంట్రోల్ లోకి వస్తుంది. ఇదిలా ఉంటే ఇండియాలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. చాపకింద నీరులా రోజురోజుకి వైరస్ బలపడుతోంది.

 

మరోపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆర్థిక రంగం దెబ్బ తింటుంది అని లాక్ డౌన్ ఆంక్షలు మరియు సడలింపులు విదిలిస్తూ ప్రజలను వదిలి వేస్తున్న తరుణంలో ఊహించని విధంగా ఇటీవల పాజిటివ్ కేసులు బయటపడటం లో స్పీడ్ పెంచాయి. వలస కార్మికులు ఇంటికి వచ్చిన తర్వాత వారి నుండి ఇటీవల చాలా మందికి ఈ వైరస్ సోకినట్లు అందువల్ల దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇటీవల ఒక ఇరవై నాలుగు గంటల్లోనే వెయ్యికి పైగా కేసులు దేశంలో బయటపడటంతో కేంద్రంలో ఉన్న నాయకులు టెన్షన్ పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: