ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్కు దాటిపోయింది. అయితే అదే సమయంలో దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల రికవరీ రేటు కూడా పెరుగుతూనే ఉంది. ప్రపంచ కేసులతో పోల్చుకుంటే భారత్‌లో పరిస్థితులు కొంచెం ఆశాజనకంగానే ఉన్నట్లు కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

 

భారత్‌లో మొత్తం లక్షా 6 వేల 7 వందల 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలు 3 వేల 3 వందలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో కరోనాతో ఇప్పటివరకు కోలుకున్న వారు 42 వేల మంది ఉన్నారు. భారత్‌లో కరోనా రికవరీ రేట్ 39.62 శాతం ఉండగా మరణాలు 0.2 శాతం ఉన్నట్లుగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 61 వేల 149 యాక్టివ్‌ కేసులున్నాయని చెప్పారు లవ్ అగర్వాల్‌.

 


ఇక...ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో 62 మందికి కరోనా ఉండగా, మన దేశంలో 7.9 కేసులు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. ప్రపంచంలో లక్షకు 4.2 శాతం మంది కరోనాతో చనిపోతుంటే..మన దేశంలో 0.2 శాతం మంది మాత్రమే మరణిస్తున్నారని వెల్లడించారు లవ్అగర్వాల్‌. 

 

ఇక...మొదటి లాక్‌డౌన్‌ విధించినప్పుడు దేశంలో రికవరీ శాతం 7.1 శాతం ఉందని, రెండో లాక్‌డౌన్‌ నాటికి అది 11.42కి పెరిగిందని చెప్పారు లవ్ అగర్వాల్‌. ఆ తర్వాత అది 26.59గాను, ప్రస్తుతం 39.62 శాతం ఉందని తెలిపారు. మొత్తానికి...గత లాక్‌డౌన్‌లతో పోల్చుకుంటే నాలుగో లాక్‌డౌన్ నాటికి పరిస్థితులు మెరుగుపడినట్లుగా కనిపిస్తోంది. 

 

మొత్తానికి భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నా.. కొంత మేర ఉపశమనం కలిగించే పరిస్థితులుంటున్నాయి. కేసులు సంఖ్య పెరుగుతున్నా.. రికవరీ రేటులో పెరుగుదల కనిపిస్తుంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాల రేటు కూడా కొంత తగ్గడం ఊపిరిపీల్చుకునే అంశం. 

మరింత సమాచారం తెలుసుకోండి: