పాకిస్తాన్ ఉగ్రసంస్థలు  ఎప్పటికప్పుడు భారతదేశం పై దాడులకు తెగబడడానికి వ్యూహాలు పన్నుత్తు  ఉంటాయి అనే విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్ములించేందుకు మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో చర్యలు చేపడుతోంది. ఇప్పటికే దాదాపుగా చాలా మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినది భారత సైన్యం. ఏకంగా వేటాడి వేటాడి మరీ ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేస్తుంది. ఇక ఉగ్రవాదం అనే పదాన్ని మొత్తం నిర్మూలించడానికి ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది భారత సైన్యం. క్రమక్రమంగా ఉగ్రవాదులను తగ్గిస్తూ వస్తుంది. అయితే ఇప్పటికే ఉగ్రవాద సంస్థల కార్యకర్తలు లాంటి ఉగ్రవాదులు అందరిని హతమార్చింది భారత సైన్యం.

 


 ఇక ఆ తర్వాత ఉగ్రవాద సంస్థలో కీలక సభ్యులను హతమార్చేందుకు తమదైన వ్యూహాలతో ముందుకు సాగి విజయం సాధించింది భారత్. అయితే ఇప్పటికే ఉగ్రవాద సంస్థ అనే చెట్టుకు ఉన్న కొమ్మలు ఆకులు అనే రాలిపోయాయి కానీ... వేళ్ళు  మాత్రం అలాగే మిగిలిపోయాయి. అంటే ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన టాప్ కమాండోలు... ముఖ్య సభ్యులు అందరూ ఇంకా అలాగే ఉన్నారు . దీంతో భారత సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా భారతదేశాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాద సంస్థల మూలాలను సమూలంగా నాశనం చేసేందుకు రంగంలోకి దిగింది. అయితే ప్రస్తుతం ఈ ఉగ్రవాద సంస్థల మూలాలను మద్దతు ప్రకటిస్తున్నటువంటిది పాకిస్తాన్.. ఇక ఈ మూలాలను నడుపుతుంది ఆ సంస్థల యొక్క హెడ్ లు. 

 


 అయితే తాజాగా ఈ ఉగ్రవాదుల మూలలు  సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన  భారత సైన్యం వేగంగా ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన టాప్ టెన్ కమాండోలను హతమార్చేందుకు వ్యూహం పన్నింది . వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని పసిగట్టి మరి వెంటాడుతుంది భారత సైన్యం. హిజ్బుల్  ముజాహిద్ కి సంబంధించి రియాజ్ నైకు , నెక్స్ట్ టాప్ కమాండర్ అయిన జునైద్ సెహ్రాయి  లను ఎన్కౌంటర్ చేశారు భద్రత దళాలు. సెంట్రల్ కాశ్మీర్లో భద్రత దళాలు ఈ కమాండోలను ఎన్కౌంటర్ చేసి చంపేశారు . అయితే ఈ టాప్ టెన్ కమాండోలను హతమారిస్తే దాదాపు ఉగ్రవాద సంస్థలకు గట్టి దెబ్బ తీసినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: