ప్రజా సంక్షేమం , అవినీతి రహిత పాలన, వ్యవస్థలో పారదర్శకత పెంచే విధంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన అందిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న నిర్ణయాలపై వరుసగా హైకోర్టులో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నిబంధనలకు అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నా, హైకోర్టులో ఎందుకు ప్రభుత్వానికి ఎందుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి అనే విషయం అంతుపట్టడంలేదు. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం, విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో పోలీసులు అనుసరించిన తీరు, మాజీ ఇంటిలిజెన్స్ బాస్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంలో వరుసగా హైకోర్టులో ఏపీ ప్రభుత్వం నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వెలువడ్డాయి. ఈ విషయంపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. 


ప్రభుత్వ పనితీరుకు కోర్టు తీర్పు లు నిదర్శనం అంటూ విమర్శలు చేస్తోంది. అలాగే ఈ విషయాలపై ప్రజల్లోనూ తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుండటంతో ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. తాజాగా వెలువడిన హైకోర్టు తీర్పుపై ప్రభుత్వ ఉన్నత అధికారులతో జగన్ ఈరోజు కీలక సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఏపీ పాలన వ్యవహారాల్లో హైకోర్టు వ్యతిరేకంగా తీర్పు వెలువరించడంపైన, నిబంధనలకు అనుగుణంగా అన్ని వ్యవహారాలు ఉంటున్నా, ఎందుకు ఈ విధంగా తీర్పు లు వస్తున్నాయి అనే విషయంపైన జగన్ చర్చించబోతున్నారట . రాష్ట్రంలో ఎన్నో సమస్యలు, వివాదాలు ఉన్నా, వాటిపై ఇంత సీరియస్ గా స్పందించని కోర్టు పోలీసులు డాక్టర్ సుధాకర్ తో దురుసుగా ప్రవర్తించారనే చిన్న కారణం ఎత్తిచూపుతూ, ఏకంగా దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించాలని ఉత్తర్వులు ఇవ్వడం, అలాగే క్యాట్ తో పాటు, కేంద్ర ప్రభుత్వం చార్జిషీట్ నమోదు కు సంబంధించి ఏబీ వెంకటేశ్వరరావు కేసులో సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంపైన జగన్ సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.


 ఈ వ్యవహారాలను ఇలా వదిలేస్తే ప్రజల్లో ప్రభుత్వంపై చులక భావం ఏర్పడుతుందని జగన్ భావిస్తున్నారు. అందుకే హైకోర్టు తీర్పుపై మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించామని, కానీ మిగతా విషయాల్లో మాత్రం ఆ విధంగా వ్యవహరించలేకపోయాయి అని జగన్ భావిస్తున్నారు. అలాగే వరుసగా కోర్టు తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండడంతో వైసీపీ ప్రభుత్వం దృష్టిపెట్టింది. 


ఇప్పటికే విశాఖ లో చంద్రబాబును అడ్డుకున్న కేసు, రాజధాని తరలింపు, రాజధాని ప్రాంతంలో పేదలకు భూముల కేటాయింపు, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, డాక్టర్ సుధాకర్, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం ఇలా అన్నిటిలోనూ వరుసగా కోర్టు తీర్పులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వస్తుండడంతో తో ప్రభుత్వ లీగల్ సెల్ లో తక్షణమే మార్పులు చేయాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉన్నతాధికారులతో జరగబోయే సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: