టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విషయంలో కఠినంగా వ్యవహరించడం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో సీబీఐ విచారణ జరగాలంటే కచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలని జీవో కూడా అప్పట్లో జారీ చేయడం పెద్ద ఇష్యూ అయింది. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కావాలని ఉద్దేశపూర్వకంగా సీబీఐ చేత, వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారిని ఇబ్బందులపాలు చేస్తోందని అప్పట్లో బాబు తన వాదన వినిపించారు. కేంద్రం యొక్క డైరెక్షన్ లో సీబీఐ పనిచేస్తుందని తీవ్రస్థాయిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.

 

కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ మరియు ఈడీ లకు రాష్ట్రంలో ఎంట్రీ లేదంటూ అప్పట్లో బాబు వ్యవహరించారు. సీబీఐ పై తనకు నమ్మకం లేదని అంటూ చంద్రబాబు అప్పట్లో వ్యాఖ్యలు చేయటం రాజకీయంగా పెను దుమారాన్నే రేపింది. అయితే ప్రతిపక్షంలో కి వచ్చాక చంద్రబాబుకి ఇప్పుడు సీబీఐ మంచిదయింది. ఇటీవల డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడానికి హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో చంద్రబాబు ఫుల్ జోష్ లో ఉన్నారు. హైకోర్టు సరైన నిర్ణయం తీసుకుందని, సీబీఐకి అప్పగించడంతో వాస్తవ విషయాలు బయటపడతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సీబీఐపై చంద్రబాబు కి అంత నమ్మకం ఉంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు.

 

దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సీబీఐ విషయంలో చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతున్నారని... అప్పుడు నమ్మకం లేదని ఇప్పుడు నమ్మకం ఉందని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. అధికారంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే మరొక లాగా వ్యవహరించాలి అంటే దానికి ఆదర్శం చంద్రబాబు అని అంటున్నారు. మరోపక్క ప్రతిపక్షంలో కి వచ్చినా గానీ ఇంకా ఈ విధంగా చంద్రబాబు యూటర్న్ నిర్ణయాలు తీసుకుంటే ప్రజల యొక్క విశ్వసనీయత టిడిపి భవిష్యత్తులో చూడలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: