మామూలుగా అయితే సినిమాలు చాలా ఆశ్చర్య కరమైన సన్నివేశాలను చూస్తుంటాం. ఇందులో ఒకటి ఎవరైనా గన్ తో  కాల్సినప్పుడు ఆ బులెట్ మనిషిలో నుండి  చొచ్చుకొనిపోయి ఆ తర్వాత మరికొంతమందికి తాకడం లేదా ఏదైనా వస్తువుకి  తాకి మరో ఘటన సంభవించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నిజ జీవితంలో మాత్రం ఇలాంటివి చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం సినిమాను తలపించేలా జరిగింది ఘటన.  ఏకంగా ఓ వ్యక్తి చెవినుంచి బుల్లెట్ వచ్చే మరో మహిళ గొంతులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. హర్యానాలోని గురుగ్రహం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

 

 వివరాల్లోకి వెళితే.. ఒక వ్యక్తి తుపాకీతో చెవిలో కాల్చుకుంటే అతని తల నుంచి బులెట్ బయటికి వచ్చి పక్కనే ఉన్న అతని భార్య మెడలోకి  దూసుకెళ్లింది. ప్రస్తుతం సదరు వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉండగా భార్య మాత్రం ప్రస్తుతం కోలుకుంటోంది. అసలేం జరిగిందంటే...ఫైరదాబాద్ కు  చెందిన ఓ వ్యక్తి ఐదు నెలల క్రితం గురు గ్రామం లోని రాంపుర  కు వచ్చి అద్దెకు ఉంటున్నాడు. సదరు వ్యక్తి ఇప్పటికే రెండుసార్లు వివాహం జరిగింది. 2017 లో మొదటి భార్య అతన్ని విడిచి పెట్టగానే 2019లో మధురకు మకాం మార్చాడు. అక్కడ ఒక గ్రోసరీ  స్టోర్  లో పనిచేస్తున్న ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే గత కొంతకాలంగా లాక్ డౌన్ కారణంగా ఎలాంటి పనులు లేకపోవడంతో సదరు వ్యక్తి ఇంట్లోనే ఉంటున్నాడు.. 

 


 దీంతో దంపతులిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. కాగా ప్రస్తుతం ఆ వ్యక్తి రెండవ భార్య ఐదు నెలల గర్భవతి సమీప  ఆసుపత్రికి రెగ్యులర్ చెకప్ కి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే శనివారం కూడా ఆస్పత్రికి రెగ్యులర్ చెకప్ కోసం కారులో బయలుదేరారు. ఇక ఉద్యోగ విషయమై భార్యభర్తలిద్దరు మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ఆ వ్యక్తి కారులో ఉన్న పిస్తోల్ తీసి చెవిలో కాల్చుకున్నాడు. అయితే పక్కనే ముందు సీట్లో భార్య కూర్చుని ఉంది. దీంతో అతని చెవిలో నుంచి దూసుకొచ్చిన బులెట్ భార్య మెడలో చొచ్చుకుపోయింది . దీంతో కారులో ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అటుగా వెళ్తున్న స్థానికులు వీరిని గమనించి గా... అపస్మారక స్థితిలో ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: