ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎక్కువగా కోర్టులను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో  కోర్టుల  నుంచి జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానాల  నుంచి జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష టిడిపి పార్టీ దీన్ని ఆసరాగా చేసుకొని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది టీడీపీ నేతలు  ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల తీర్పులు ఇవ్వడాన్ని  గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా మరోసారి టిడిపి నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ... ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న తీర్పులను ఉద్దేశిస్తూ జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

 

 రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో న్యాయ స్థానాల నుంచి తీర్పులు రావడం తాను ఎన్నడూ చూడలేదు అంటూ వ్యాఖ్యానించారు బండారు సత్యనారాయణ. జగన్మోహన్ రెడీ  సర్కార్ తమ మాయమాటలతో ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను పూర్తిగా నాశనం చేయాలని చూస్తుంది అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు జగన్ సర్కార్ చెప్పినదానికల్లా  ఎస్ అంటున్న అధికారులందరూ... ఆ తరువాత న్యాయస్థానాల చుట్టూ తిరగక తప్పదు అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ. 

 


 సీఎం జగన్ కి విజయసాయి రెడ్డి కి జైలు జీవితం గడపడం అలవాటు అని వ్యాఖ్యానించిన బండారు సత్యనారాయణ... ఆంధ్రప్రదేశ్ డిజిపి అయిన గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ లు భవిష్యత్తులో మీ  పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి వ్యాఖ్యానించారు. సజ్జల రామకృష్ణారెడ్డి తయారుచేస్తున్న జీవోలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్ని గుడ్డిగా సంతకాలు చేస్తున్నారు అంటూ విమర్శించారు బండారి సత్యనారాయణ. గతంలో కీలక పదవుల్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రస్తుతం న్యాయస్థానాల చుట్టూ ఎలా తిరుగుతున్నారో  కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: