జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది అయిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం గురించి ప్రజలలో సానుకూలమైన వాతావరణమే ఉంది అని చాలామంది అంటున్నారు. అనుభవం లేకపోయినా ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమ పరిపాలన అందిస్తున్న తరుణంలో జగన్ పాలన పై చాలా మంది ప్రజలు సానుకూలంగా ఉన్నారని ఇటీవల పలు సర్వే లలో తేలింది. కరోనా వైరస్ లాంటి కష్టకాలంలో కూడా ప్రజలకు నాలుగు సార్లు ఉచితంగా రేషన్ అదే విధంగా నగదు ఇచ్చి ఆదుకోవడంతో పాటుగా కరోనా వైరస్ కట్టడి విషయంలో పగడ్బందీగా వ్యవహరించడంతో జగన్ పేరు మారుమ్రోగుతోంది. కానీ ఇటువంటి సమయంలో వైసీపీ నేతలు చేస్తున్న పనులు పార్టీ పరువు మాత్రమే కాకుండా జగన్ కి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.

 

పూర్తి మేటర్ లోకి వెళితే జగన్ కింద స్థాయి నాయకులు చేస్తున్న పనులు, నిర్ణయాలు ప్రభుత్వానికి మరియు పార్టీకి తీవ్ర నష్టమే కాకుండా ప్రజలలో ఓ రకమైన భావన కలిగించే విధంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఈజీగా ప్రతిపక్షాలకు జుట్టు ఇచ్చే విధంగా పరిస్థితి తయారవుతోంది. ప్రజెంట్ జగన్ పార్టీని పూర్తిగా ఇరుకున పెట్టిన శ్రీ వారి భూముల అమ్మకం విషయంలో ఇదే జరిగింది. ఏ మాత్రం దేవస్థానానికి ఉపయోగం లేదని ఈ భూములు అమ్మడం వల్ల కేవలం కోటిన్నర మాత్రమే ఆదాయం వస్తుందని లెక్కలు చెబుతున్నారు వైస్సార్సీపీ నాయకులూ . మరి అటువంటి భూములు అమ్మటం వల్ల ఎవరికి ఉపయోగం లేకపోయినా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాలి అన్న వాదన ప్రజలలో నెలకొంది.

 

అసలు దేవుడి భూములను టచ్ చేయడం దేనికి అని చాలామంది శ్రీవారి భక్తులు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ఎటువంటి ధర పలకని అటువంటి భూములను అమ్మకానికి పెట్టి ప్రభుత్వంపై విమర్శలు వచ్చే విధంగా నాయకులు నిర్ణయాలు తీసుకోవటం పట్ల వైసీపీ పార్టీలో ఉన్న కొన్ని వర్గాలకు చెందిన నాయకులు కూడా తలపట్టుకుంటున్నారు. మరోపక్క ఈ విషయాన్ని ఆధారం చేసుకునే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు మతతత్వ రాజకీయాలు చేసేలా ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో జగన్ సర్కార్ కి సొంత పార్టీలో ఉన్న నాయకులు చేస్తున్న నిర్ణయాలే ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తున్నాయి అన్న వాదన ప్రజలలో బలంగా వినబడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: