చైనా ఇన్నాళ్ళూ దొంగచాటుగా భారత్ ని దెబ్బతీస్తూ వచ్చింది. చైనా అరవయ్యేళ్ళుగా చేస్తున్న ఈ ప్రచ్చన్న యుధ్ధానికి భారత్ చాలా నష్టాన్ని చూడాల్సివచ్చింది. అయితే భారత్ విధానం ఎపుడూ కరెక్ట్ గా ఉంటుంది. తనకు తానుగా యుధ్ధానికి వెళ్లదు, ఎవరైనా కవ్విస్తే గతంలో చూసీ చూడనట్లుగా ఊరుకునేది. కానీ ఇది మోడీ ఏలుతున్న భారతం. ఇప్పటికే పాకిస్తాన్ పీచమణచిన మోడీ తన మార్క్ ఏంటో చైనాకు కూడా రుచి చూపించే సమయం ఆసన్నమైంది అంటున్నారు.

 

చైనా ఇపుడు యుద్ధ దాహంతో రగిలిపోతోంది. ప్రపంచం మొత్తానికి  చైనీయులను శత్రువులని చేసిన జిన్ పింగ్ ఆ పాపాన్ని, శాపాన్ని తప్పించుకోవడానికి వేసిన కొత్త ఎత్తే భారత్ తో యుధ్ధం. నిజానికి ఈ తరహా చీప్ ట్రిక్కులను ఇంతకాలం దాయాది దేశం పాకిస్తాన్ చేస్తూ వచ్చింది. ఎపుడు పాకిస్థాన్లో అంతర్గత గొడవలు, సంక్షోభం ఉన్నా కూడా పాక్ చేసే మొదటి పని భారత్ తో కయ్యానికి కాలు దువ్వడమే.

 

ఇపుడు అంత పెద్ద దేశంగా ఉన్న చైనా కూడా ఇలాంటి నీచమైన ఎత్తుగడకు పూనుకోవడమే దారుణం. చైనాకు అపరిమితమైన సైన్యం ఉంది. దాంతో కండకావరం కూడా బాగా పెరిగింది. దాని కావరం ఇంతవరకూ ఏ దేశమూ అణచలేదు. ఇపుడు కరోనా మహమ్మారిని ప్రపంచం మీదకు వదిలినా కూడా ఒక్క అమెరికా తప్ప ఎవరూ బయటకు  వేలెత్తి చూపలేకపోతున్నారు.

 

దాంతో చైనా బరితెగించి భారత్ మీద యుధ్ధానికి సిధ్ధమవుతోంది. ఇప్పటికే చైనా భారత్ భూభాగాన్ని టార్గెట్ చేసింది. మనకు చెందిన యాభై కిలోమీటర్ల భూభాగం ఆక్రమించిన‌ట్లుగా సమాచారం ఉంది. దాంతో భారత్ లెఫ్టినెట్ జనరల్ కీలక సమావేశాన్ని రేపు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో మన భూభాగం విడిచి వెళ్ళాలని చైనాకు అల్టిమేట్ జారీ చేస్తారట. మాట వినకపోతే యుధ్ధమే అంటున్నారు.

 

ఇదిలా ఉండగా  కాశ్మీర్లోని లఢక్ సరిహద్దులోని లోయలో అటు చైనా, ఇటు భారత్ బలగాలు గట్టిగా మోహరించి ఉన్నాయి. అసలే ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఉంది. దానికి తోడు కరోనా మహమ్మారి ఉంది. ఇపుడు కనుక యుధ్ధం అంటే రెండు దేశాలు అపారంగా నష్టపోతాయి. కానీ యుధ్ధం అనివార్యం అంటున్నాయి పరిస్థితులు అదే కనుక జరిగితే 1962 తరువాత రెండు దేశాలు తొలిసారి యుధ్ధానికి తలపడినట్లే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: