ప్రపంచంలో కరోనా మహమ్మారి ఎంతగా జనాలను భయపెట్టిందంటే.. మనిషని చూస్తే మనిషి భయపడేంతగా.  ఎవరైనా తుమ్మినా, దగ్గినా.. ఏమాత్రం అస్వస్థతగా ఉన్నా ఆదరించాల్సింది పోయి.. ఆమడ దూరం వెళ్లిపోతున్నారు.  ఎంత దారుణం అంటే కరోనా తో మరిణించిన వారి దగ్గరకు వెళ్లి దహన సంస్కారలు కూడా చేయలని దౌర్భాగ్యం నెలకొంది.   ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ సడలింపులు చేస్తున్నారు.. దాంతో షాపింగ్ మాల్స్.. ఇతర జనావాసలు ఉన్న వ్యవస్థల వద్ద రోబోలను ఏర్పాటు చేస్తున్నారు.   కరోనా కారణంగా మనుషులకు బదులుగా రోబోలకు ఆధరణ పెరిగింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీటిని ఉపయోగించి చర్యలు చేపడుతున్నారు.

IHG

ఇందులో భాగంగా సింగపూర్ కూడా ఇలాగే పార్కుల్లో కుక్కల్నిపోలిన రోబోలను కాపలాగా పెట్టారు.  వీటి పని ఏంటంటే దగ్గర దగ్గర ఎవరైనా వస్తే వారి వద్దకు వెళ్లి హెచ్చరిస్తుంది.  వీటి ద్వారా ప్రజలు భౌతిక దూరం ఉండేలా సూచనలు ఇస్తున్నారు. భారత్‌లో మిత్ర రోబో కరోనా రోగులకు సేవలు అందిస్తోంది. ఇలాగే థాయ్ లాండ్‌లో కుక్కను పోలిన ఓ రోబో శానిటైజర్లను అందిస్తూ.. ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. దాని సేవలకు జనం ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం శానిటైజర్ల వాడకం పెరుగుతుండటంతో ప్రతి చోట వీటిని విధిగా ఏర్పాటు చేస్తున్నారు.

IHG'Made in India' robot that stole the show at GES Hyderabad

ముఖ్యంగా  షాపింగ్ మాల్స్, హెటల్స్ ,షాపింగ్స్ ఎక్కడికి వెళ్లినా విధిగా వీటిని అందుబాటులో ఉంచుతున్నారు. బ్యాంకాక్‌లోని పాపులర్ సెంట్రల్ వరల్డ్ మాల్‌లో భిన్నంగా  రోబోల ద్వారా వీటిని అందిస్తున్నారు. సహజంగా చిన్న నుంచి పెద్ద వరకు రోబోలు అంటే ఎవరైనా వింతగా చూస్తుంటారు. K9 అనే రోబో డాగ్ తన వీపుపై శానిటైజర్ బాటిల్స్ పెట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ చేతులు శుభ్రం చేసుకోవాలని అక్కడికి వచ్చిన వారికి గుర్తు చేస్తుంది. ఇక దీని పనులు చూస్తే అబ్బుర పడిపోతారు. మనుషుల వద్దకే వచ్చి ఇలా గుర్తు చేయడం బాగుందని అంటున్నారు. కుక్క ఎముకల గూడును పోలి ఉన్న ఈ రోబో  5జీ టెక్నాలజీతో పనిచేస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: