దేశంలో కరోనా ఎప్పుడు మొదలైందో కానీ.. అప్పటి నుంచి చిత్ర విచిత్రాలు జరగుతున్నాయి. మార్చి 24 నుంచి లాక్ డౌన్ మొదలు పెట్టారు.. అప్పటి నుంచి ఎలాంటి శుభకార్యాలు జరగలేదు. ఒకవేళ ఎంతో సీక్రెట్ గా పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు జరుపుకున్నా.. అవి కాస్త బయట పడటంతో వారిపై కేసులు నమోదు చేశారు.  ఇలాంటి శుభకార్యాలకు హాజరైన వారిలో ఎవరికో కరోనా సోకడం.. దాంతో వారందరినీ క్వారంటైన్ కి తరలించడం కామన్ అయ్యింది.  ఇలా ఎంతో మంది వివాహాది శుభకార్యాలకు వెళ్లి క్వారంటైన్ పాలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే కరోనా భయంతో పెళ్లిళ్లు జరుపుకున్నా సోషల్ డిస్టెన్స్ మేయింటేన్ చేస్తూ చిత్ర విచిత్రంగా పెళ్లీళ్లు జరుపుకున్నారు.   ఓ పెళ్లిలో కరోనా చేసిన చిత్రం గురించి తెలిస్తే ఫక్కున నవ్వేస్తారు. పెళ్లిలో పెళ్లికూతురు పెళ్లి కొడుకులు పెళ్లిళ్లలో పూల దండలు మార్చుకోవటం సంప్రదాయం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

వధువు వరుడి మెడలో పూలమాల వేసినట్టే.. వధువు మెడలో వరుడు పూలమాల వేస్తాడు. ఇది అనాధిగా వస్తున్న సాంప్రదాయం అన్న విషయం తెలిసిందే.  ఈ మద్య పెళ్లి కార్డులు మాస్కుల రూపంలో కొట్టిస్తూ వచ్చిన అతిథులకు ఇస్తున్నారు.  శానిటైజర్లు, ఇతర మాస్కులు కామన్ అయ్యాయి. ముఖానికి మాస్కులు ధరించి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. తాజాగా ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. వధూవరులు పూల దండలతో పాటు ముఖానికి కట్టుకునే మాస్కులను కూడా మార్చుకున్నారు. అస్సాం రాష్ట్రంలో ఈ వింత ఆచారం పుట్టుకొచ్చింది. ఆ రాష్ట్రానికి చెందిన ఓ జంట పెళ్లిలో ఇలా ఒకరికొకరు మాస్కులు మార్చుకున్నారు.

 

ముందు వరుడు, వధువుకు మాస్కు తొడిగితే..  ఆ తర్వాత వరుడు తిరిగి ఆమెకు మాస్కు తొడగాడు.ఇదే ఇప్పుడు కరోనా కొత్త సంప్రదాయం అంటున్నారు.  భవిష్యత్ లో ఈ టైప్ లోనే పెళ్లిళ్ళు జరుగుతాయని అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు నవ్వుల ఎమోజీలు పంచుకుంటున్నారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: