కేరళ రాష్ట్రంలో ఏనుగు మృతి దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. ఆకలితో ఉన్న ఏనుగుకు ఏకంగా పైనాపిల్లో బాంబులు పెట్టి ఇవ్వటంతో అది తిన్న ఏనుగు  ఆ బాంబులు పేలి గాయపడింది. దీంతో పరుగున వెళ్లి నదిలో ప్రాణాలు విడిచింది ఆ ఏనుగు . ఏనుగు చనిపోయిన సమయంలో అది  గర్భంతో ఉండడం మరింత మంది హృదయాలను కలచివేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారక.. ఎంతోమంది సేవ్ ఎనిమల్ అనే నినాదాన్ని కూడా తెరమీదకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ ఏనుగు మృతి కేసులో విచారణను కూడా ముమ్మరం చేశారు అధికారులు. 

 


 ఓ ఫారెస్ట్ అధికారి  పైనాపిల్ లో బాంబు పెట్టి అది తినడం కారణంగా లోపల అది పేలడంతో తీవ్రంగా గాయాలపాలై  మృతి చెందింది అని  తెలపడంతో ఈ నిజం  వెలుగులోకి వచ్చింది  విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఏకంగా ముగ్గురిపై కేసు రిజిస్టర్ చేశారు అధికారులు. వీరిలో ఒకరిని  ఇప్పటికే అరెస్టు చేయగా ఇద్దరు పరారీలో ఉన్నారు. అయితే అడవి నుంచి వచ్చే జంతువులు భయ పెట్టడం కోసం చంపడం కోసం ఏర్పాటుచేసిన పళ్లలో  ఇలాంటి బాంబులు పెడుతున్నారని.. కొన్ని రోజుల నుంచి అక్కడి పలు ప్రాంతాలలో ప్రచారం జరుగుతోంది. 

 


 అయితే అసలు అటవీ ప్రాంతం అయినప్పటికీ తమ ప్రాంతాన్ని విస్తరించుకుంటూ ఏకంగా మూగజీవాలు ఉండే అడవిని నరికి వేసి అక్కడ ఇల్లు నిర్మించుకున్నారు. అలాంటిది మూగజీవాల స్థలం లోకి వెళ్లి వాటిని చంపడం ఏమిటి అని ప్రస్తుత పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కేసులో మరిన్ని వివరాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఆ బాంబులు తయారు చేసుకుంది కూడా సదరు కుటుంబ సభ్యులేనట . ఇక ఈ బాంబులతో ఒక్కో బాంబుతో ఒక్కొక్కరికి ప్రాణం కూడా తీయటానికి వీలుంటుందట. మొదట్లో అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు దీపావళి పటా కాయలు వాడి భారీ శబ్దాలు సృష్టించి అడవిలో నుంచి వస్తున్న జంతువులను తరిమి కొట్టే ప్రయత్నం చేసే వారిని క్రమక్రమంగా ఎలాంటి ఖర్చులేకుండా నాటు బాంబులు చుడుతూ  ఇలా జంతువులను భయపెట్టే ప్రయత్నం చేశారని ఈ క్రమంలోనే ఏనుగు కూడా చనిపోయింది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: