ప్రస్తుతం  తెలుగు రాష్ట్రాల మధ్య జల హక్కులు వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. వివాదంలో చాలామంది ఎన్నో విమర్శలు ప్రతి విమర్శలు కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ వివాదంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం కాస్త సైలెంట్ గానే ఉంటున్నారు. న్యాయపోరాటం చేస్తామని చెబుతున్నారు తప్ప ఒకరిపై ఒకరు విమర్శలు మాత్రం చేసుకోవడం లేదు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే గోదావరి జిల్లాలో 950 టిఎంసిలు తెలంగాణకు ఇస్తామని చెప్పారు. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సరైన కరెంటు సదుపాయం ఉండదు నీటి సదుపాయం ఉండదు అంటూ పలు అంశాలు లేవనెత్తారు. 

 


 కానీ కిరణ్ కుమార్ రెడ్డి వాదనను అప్పట్లో టిఆర్ఎస్ పార్టీ కొట్టివేసి చులకనగా చూసింది. కానీ ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్లీ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ గోదావరి జలాలకు సంబంధించినటువంటి బోర్డు సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి కి సంబంధించి ఒక విచిత్రమైన పాయింట్ను తెరమీదికి తెచ్చారు. గోదావరి బోర్డు సమావేశంలో ఏపీ అధికారులు తెలంగాణా కి ఎలాంటి వాటా లేదు అంటున్నారు.. లేదు గోదావరి జలాలలో 950 టీఎంసీల వాటా ఉందని తెలంగాణ నాయకులు అధికారులు అంటున్నారు.... అయితే  బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు నీటి కేటాయింపులు ఎక్కడ ఉన్నాయో చూపించండి అంటూ అడిగారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికారులు నాయకులు. 

 


 ఎక్కడ తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపులు బచావత్ ట్రిబ్యునల్ లో లేవు. నీటి వినియోగాన్ని లెక్కించేందుకు టెలి  మీటర్లు ఏర్పాటు చేసేందుకు మేము కూడా సిద్ధమే అంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికారులు తెలిపారు. అయితే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  950 టిఎంసిలు తెలంగాణ రాష్ట్రానికి వాటా ఉంది అని చెప్పారు అంటూ ఒక అంశాన్ని తెరమీదికి తెచ్చారు. కాబట్టి మా మాట మాకు ఇవ్వండి అంటూ తెలంగాణకు చెందిన అధికారులు అడిగారు.మిగులు జలాలను  వాడుకునేందుకు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేతలు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని.. కానీ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి పాయింట్ మాత్రం లేవనెత్తారు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: