జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్లు కొన్ని కొన్ని సార్లు అందరిని  అయోమయంలో పడేస్తూ  ఉంటాయి అనే విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ తెలిసి ఇస్తారా తెలియక ఇస్తే రా అన్నది పక్కన పెడితే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లు మాత్రం ఎప్పుడు చర్చనీయాంశంగా మారి పోతూ ఉంటాయి. ఒక జాతీయ పార్టీ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి అయిన వ్యక్తి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం పై ఎంతో మంది ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ప్రతి విషయంలో ఎప్పుడూ స్టేట్మెంట్ ఇచ్చిన అది చిత్ర విచిత్రంగా ఉంటుంది. గతంలో కరోనా  వైరస్ విషయంలో ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఇలాగే ఉన్నాయి. భారత దేశ జనాభాతో పోలిస్తే 10 శాతం కూడా జనాభా  లేని దేశాలతో భారతదేశాన్ని పోల్చటం .. అంతేకాకుండా లాక్ డౌన్ తో  ప్రయోజనం ఏమీ లేదని చెప్పడం ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్  ఎత్తేస్తే ఎందుకు ఎత్తేస్తున్నారు అంటూ ప్రశ్నించడం ఇదంతా రాహుల్ గాంధీ ఇచ్చిన చిత్ర విచిత్రమైన స్టేట్ మెంట్లు అని అంటున్నారు విశ్లేషకులు. 

 

 ఇక ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా ఇంతలా లాక్ డౌన్  పెట్టలేదు అంటూ రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపై రాజకీయ విశ్లేషకులు మాత్రం కాస్త ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. ఎప్పుడైనా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే లాక్ డౌన్  విధిస్తారని.. ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు లాక్‌డౌన్‌ ఎందుకు విధిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ యుద్ధాల సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దు అని చెప్పడం లాక్ డౌన్ కాదు అని హెచ్చరిక అవుతుందని అంటున్నారు. 

 

ప్రస్తుతం కరోనా వైరస్ పై చేస్తున్నది   కేవలం కరోనా  వైరస్ యుద్ధం మాత్రమే అవుతుంది  అంటున్నారు విశ్లేషకులు. ప్రపంచ యుద్ధం అంటే దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుందని... కాని ప్రస్తుతం కరోనా  వైరస్ మాత్రమే ప్రపంచాన్ని మొత్తం నాశనం చేయాలి అనుకుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. అయితే ఒక దేశం మరొక దేశం పైన యుద్ధం చేసుకోవడం కాదు ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ పై యుద్ధం చేస్తుంటే ఇలాంటి సమయంలో వ్యాఖ్యానించడం విడ్డూరం అంటున్నారు విశ్లేషకులు. ఒక ప్రధాని అభ్యర్థి అయిన వ్యక్తికి ఇలాంటి ఆలోచన తీరు ఉండటం ఏంటని  ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: