విద్యుత్ వినియోగదారులు బయపడ్డట్టే జరిగింది.. లాక్‌డౌన్‌కు ముందు విద్యుత్ విషయంలో ఎన్నో తర్జభర్జనలు చేసిన అధికారులు చివరకు ఆ భారాన్ని ప్రజలే మోయక తప్పదని తేల్చేశారు.. ఇక లాక్‌డౌన్ ముగిసిన నేపధ్యంలో ఇంటింటికి విద్యుత్ బిల్లులు పంపిణి చేయగా ఆ బిల్లులను చూసిన వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.. అంతే కాకుండా అయోమయంలో పడిపోయి అసలు తాము ఈ మూడు నెలల కాలంలో వాడిన విద్యుత్‌కు ఇప్పుడు వచ్చిన బిల్లుకు పొంతన కుదరడం లేదని తికమక పడుతుండగా ఈ విషయంలో దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ జి.రఘుమారెడ్డి మాట్లాడుతూ, లాక్‌డౌన్‌ కాలంలో బకాయిపడిన విద్యుత్తు బిల్లులను వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశమిస్తామని అన్నారు.

 

 

ఇక ఈ లాక్‌డౌన్ వల్ల దాదాపు 40 శాతం మంది వినియోగదారులు బిల్లు చెల్లించలేదన్నారు. కాగా నిబంధనల మేరకు బకాయిలపై 1.5 శాతం వడ్డీ పడుతుందని.. దీనిని తొలగించే అధికారం తమకు కూడా లేదని పేర్కొన్నారు.. ఇక ఈ వేసవిలో ఎండల వేడి, లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇంట్లోనే ఉండటం వల్ల గృహ వినియోగం పెరిగి కేటగిరి మారి బిల్లులు ఎక్కువ వచ్చాయే తప్ప తాము ఎక్కడా పెంచలేదన్నారు.. ఇకపోతే లాక్‌డౌన్‌ అనంతరం ఒకేసారి మూడు నెలలకు కలిపి ఇచ్చిన విద్యుత్తు బిల్లులు అధికంగా వచ్చాయనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో పై విధంగా వివరణ ఇచ్చారు.

 

 

ఇదే కాకుండా మూడునెలల బిల్లులు ఒకేసారి తీసినా దాన్ని విడదీసి నెల వారిగా లెక్కించామని తెలిపారు. ఇక ఈ విద్యుత్ గృహ విభాగంలో మూడు కేటగిరిలు, 9 స్లాబ్‌లు ఉన్నాయి. వాటిని ఒక సారి చూస్తే.. 100 యూనిట్ల లోపు ఒక కేటగిరి, 101-200 వరకు రెండోది, 201 పైన మూడో కేటగిరి ఉందన్నారు. ఈ విధానంలోనే బిల్లులు లెక్కకటామని.. అదీ గాక ఈ మూడు నెలల సగటు బిల్లులతో ఎక్కువమందికి మేలే జరిగిందని, ఇంతకంటే శాస్త్రీయ విధానం లేదని సమాధానం ఇచ్చారు..

 

 

ఇక అసలే ఉద్యోగాలు లేక ఆదాయం సరిపోక అంతంత మాత్రంగానే బ్రతుకుతున్న పేద, సామాన్య ప్రజల బ్రతుకుల్లో ఈ బిల్లులు తలకు మించిన భారమె. ఇక కేసీయార్ ఇచ్చిన 3000 వేల రూపాయల్లో మద్యానికే ఖర్చు అవగా, ఇప్పుడు కరెంట్ బిల్లులకు కూడ చెల్లించవలసి వస్తుంది.. ఇచ్చి ఏం లాభం.. ఇలా ఇచ్చి అలా లాగేసుకున్నారంటూ ప్రజలు బాధపడుతున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: