దేశంలో ప్రభుత్వాలు మెరుగైన ఆసుపత్రి సేవలు అందిస్తున్నాం అంటున్నారు.  ప్రైవేట్ ఆసుపత్రులను తలదన్నే అన్ని సేవలు అందిస్తున్నామంటున్నారు.. కానీ దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వనట్టు ఇక్కడ సిబ్బంది మాత్రం జనాలకు నానా ఇబ్బందులు పెడుతున్నారు.  ఆసుపత్రి కి వచ్చి నిస్సహాయ పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లిన ఎంతో మంది రోగులను ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. పేదవారైతే ప్రాణాలు వదిలే పరిస్థితి నెలకొంటుంది. తాజాగా కొంది మంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు గర్భిణ 13 గంటల పాటు అవస్థ పడి చివరికి ప్రాణాలు విడిచింది.  ఈ దారుణమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌, నోయిడాలో   చోటు చేసుకుంది.

 

పురిటి నొప్పులు వచ్చిన మహిళను ఆసుపత్రిలో చేర్చుకోవడానికి వైద్యులు నిరాకిరించారు.  ఆమె భర్త అంబులెన్స్‌లో పురిటి నొప్పులు పడుతున్న తన భార్యను తీసుకుని 13 గంటలపాటు 8 ఆసుపత్రులకు తిరిగాడు. అయినా ఏ ఒక్కరూ కనికరించలేదు. దీంతో ఆమె అంబులెన్స్‌లోనే కన్నుమూసింది.  గౌతమ్‌బుద్దనగర్‌ జిల్లాలోని కోడా కాలనీలో వీజేందర్‌సింగ్‌, నలీమ్‌ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. నలీమ్  ఎనిమిదో నెల గర్భిణిగా ఉండగా, అనుకోకుండా పురిటినొప్పులు మొదలయ్యాయి. మొదట ఒక ఆసుపత్రికి వెళ్లగా వారు సరిపడా బెడ్స్‌ లేవని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో తప్పదన్నట్టు వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇలా అంబులెన్స్ తన భార్యను తీసుకు వెళ్లే.. వెళ్లిన ప్రతి చోట ఏవో ఒక కారణాలు చెప్పి తిప్పి పంపించారు.   

 

అలా మొత్తం 13 గంటల్లో ఎనిమిది ఆసుపత్రులు తిరిగినా ఎవ్వరూ కనికరించలేదు. దీంతో నలీమ్‌ నొప్పులు తాళలేక ఆంబులెన్సులోనే కన్నుమూసింది.  నిండు గర్భిణి అన్న మానవత్వం లేకుండా పిచ్చి కారణాలు చెప్పి తన భార్య మరణానికి కారణమైన వైద్య సిబ్బందిపై భర్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా పాలనాధికారి సుహాస్‌ ఎల్‌వై దీనిపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ముఖ్య వైద్యాధికారి మునీంద్ర నేతృత్వంలో ఘటనకు కారణమైన ఆసుపత్రులపై విచారణ చేస్తున్నారు.  ఈ ఘటనపై స్పందించిన జిల్లా పాలనాధికారి సుహాస్‌ ఎల్‌వై దీనిపై విచారణకు ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: