ప్రపంచంలో కరోనా కేసులు ప్రతరోజూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా.. లాక్ డౌన్ పాటిస్తున్నా కరోనా కేసులు, మరణాల పెరిగిపోతున్నాయి.  లాటిన్‌ అమెరికా దేశం బ్రెజిల్‌లో కరోనా విజృంభిస్తున్నది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 27,075 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఈ వైరస్‌ ప్రభావంతో 904 మంది బాధితులు మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,72,846కు పెరిగింది. బ్రేజిల్‌లో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 3,38,366 యాక్టివ్‌ కేసులు ఉండగా, 3,02,084 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు ఈ మహమ్మారి వల్ల 35,930 మంది మరణించారు. 

IHG

కాగా, దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు, మృతుల వంటి విషయాలకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ప్రభుత్వం తొలగించింది.   మరోవైపు రష్యాలో ఈ మద్యనే కరోనా కేసులు బాగా పెరిగిపోయాయి...   ఇక్కడ రోజురోజుకు కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్‌ సోకి మరణించిన వారి సంఖ్య 55 కు చేరింది.  ఇప్పటివరకు మాస్కోలో 2,919 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 5,859తో కలుపుకొని మొత్తం 4,67,673 మంది పాజిటివ్‌గా తేలారని రష్యా ప్రభుత్వ అధికార వార్తా సంస్థ తెలిపింది.   

IHG

రష్యా మొత్తమ్మీద ఆదివారం నాడు 8,984 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తేలగా.. ఈ ఒక్కరోజునే 134 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 5,343 మంది వివిధ దవాఖానల నుంచి డిశ్చార్జి అవగా.. ఇప్పటివరకు మొత్తం 2,26,731 మంది రికవరీ సాధించారు.  ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 70,00,815 కరోనా కేసులు నమోదవగా, 4,02,575 మంది మరణించారు. 34,22,299 మంది బాధితులు కోలుకోగా, 31,75,941 మంది చికిత్స పొందుతున్నారు.  ఇప్పటి వరకు కరోనాక వ్యాక్సిన్ కనుగొనలేదన్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: