ఆగస్ట్ 15 తర్వాత దేశవ్యాప్తంగా కొత్త విద్యాసంవత్సరం మొదలవుతుందని కేంద్రం చెప్పింది. ఈలోగా పరీక్షల ఫలితాలు కూడా వచ్చేస్తాయని చెబుతోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే.. విద్యాసంస్థలు ప్రారంభించాల్సిందిగా ఇప్పటికే అన్ని స్కూళ్లు, కాలేజీలకు గైడ్ లైన్స్ జారీ చేశామని గుర్తుచేస్తోంది. 

 

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మార్చి మధ్య నుంచి స్కూళ్లు మూతపడ్డాయి. స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారనే అంశంపై అటు విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు కూడా సందిగ్ధంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో స్కూళ్లు ఎప్పుడు ఓపెన్ చేస్తామో చెప్పారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్. ఈసారి ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవంతో పాటుగా.. కొత్త విద్యా సంవత్సరం గురించిన శుభవార్త కూడా కేంద్రం చెప్పబోతోంది. కోవిడ్ కారణంగా మార్చి రెండో వారం నుంచి అర్థాంతరంగా విద్యాసంస్థలు మూతపడిన తరుణంలో.. ఆగస్ట్ 15 తర్వాత స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేస్తామని కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పోఖ్రియాల్ చెప్పారు. ఆగస్ట్ 15 నాటికి గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న పరీక్షల ఫలితాలు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. 

 

ఆగస్ట్ తర్వాతే స్కూళ్లు ఓపెన్ చేస్తామని కేంద్రం చెప్పింది. దేశవ్యాప్తంగా సుమారు 33 కోట్ల మంది విద్యార్థులు స్కూళ్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారా? అని గందరగోళంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5 సందర్భంగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జులైలో స్కూళ్లు రీ ఓపెన్ చేసే అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది. కేవలం 33 శాతం అటెండెన్స్‌తో స్కూళ్లు నిర్వహించే అవకాశం ఉంది. అది కూడా 8 కంటే చిన్న తరగతుల వారిని మినహాయించి, ఆ పైన విద్యార్థులకు మాత్రమే స్కూళ్లు నిర్వహించే ఛాన్స్ ఉంది. మిగిలిన వారు ఇంటి వద్దే ఉండక తప్పదు. రెండు సెషన్లలో స్కూళ్లు నిర్వహిస్తారు. మార్నింగ్ ఒక బ్యాచ్, మధ్యాహ్నం మరో బ్యాచ్ విద్యార్థులు క్లాసులకు హాజరయ్యేలా ప్రణాళికలు వేస్తున్నారు. అలాగే, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉండే స్కూళ్లను ముందుగా ఓపెన్ చేయనున్నారు.

 

 మరోవైపు వచ్చే విద్యాసంవత్సంలో 30 శాతం సిలబస్‌ను తగ్గించాలంటూ ఇటీవల ఢిల్లీ సర్కారు ప్రతిపాదించింది.  దక్షిణ కొరియాలో స్కూళ్లు తెరిచిన తర్వాత కేసులు పెరగడంతో.. మళ్లీ వెంటనే మూసేశారని, దేశంలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కేంద్రం చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: