2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ రేంజ్ లో మెజారిటీ  సాధించి ఘన విజయాన్ని సాధించిన విషయం. ఇక జగన్మోహన్ రెడ్డి చిరకాల కల అయిన  ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ తిరుగులేని పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సరైన ప్రతిపక్షం  కూడా లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంతో మంది టిడిపి పార్టీకి చెందిన వాళ్లు వైసీపీ పార్టీ వైపు వస్తున్న విషయం తెలిసిందే . పార్టీలో చేరకపోయినా ఎప్పటికీ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత ఎంతోమంది టీడీపీకి చెందిన కీలక నేతలు వైసీపీ  పార్టీకి సహకరిస్తూ కొంతమంది బీజేపీలో చేరడం కొంతమంది వైసీపీ వైపు మద్దతు ప్రకటించడం చేశారు. ఈ క్రమంలోనే అధికార పార్టీకి తిరుగులేదు అని చూపిస్తున్న జగన్ మోహన్ రెడ్డి. 

 

 ఇక తాజాగా టిడిపి పార్టీ అనుకూలంగా ఉండే ఒక మీడియా సంస్థ.... వైసిపి పార్టీ ఎంపీలకు సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి సంబంధించిన పది మంది ఎంపీలు చంద్రబాబుతో టచ్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం టిడిపి పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుంటే వాళ్లు వెంటనే బీజేపీ లోకి జంప్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఆయన చెప్పిన మాటలు నాలుగు అంశాలు కీలకం గా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. టిడిపి పార్టీ తో బిజెపి పొత్తు పెట్టుకుంటే బిజెపికి ఎంతగానో లాభం చేకూరుతుంది అనేది ఒక పాయింట్ అయితే... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 23 మంది ఎంపీలు ఉన్న విషయం తెలిసిందే. 

 

ఇక వారి నుంచి ప్రస్తుతం టీడీపీలోకి అని బీజేపీ లోకి గాని రావాలి అంటే ఏకంగా  15 మంది ఎంపీలు రావాల్సి ఉంది. ఒకవేళ అంతా  మంది ఎంపీలు ఇక్కడ వైపు రాకపోతే కష్టమే . అయితే భారతీయ జనతా పార్టీ పదవిలో ఉన్న వారిని రాజీనామాలు చేయించి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా 10 మంది ఎంపీలను బిజెపి చేర్చుకోవడానికి వెనుకడుగు వేయలేదు అంటున్నారు. ప్రస్తుతం జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఎలాంటి అక్రమార్జనకు సంబంధం లేకపోవడంతో ఎక్కువ మొత్తంలో ఆయన పై అసంతృప్తి జ్వాలలు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుత అధికార పార్టీ ఎంపీల కు సంబంధించిన అంశం సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ వైసిపి ఎంపీలు గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: