భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో కలకలం సృష్టించి తద్వారా వీలైనంత ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం చేకూర్చాలని చూసే పాకిస్తాన్ భారీ షాక్ తగిలింది. జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలోని రేబన్ ప్రాంతంలో భారత రక్షణ దళం చాలా పక్కా ప్రణాళికతో ఉగ్రవాదుల ఏరివేతకు ఒక అద్భుతమైన ఆపరేషన్ చేపట్టారు. రేబన్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారని పక్కా సమాచారం మేరకు పోలీసులు చాలా చాకచక్యంగా సమయం తీసుకుని ప్లాన్ వేసి మరి వారిని మట్టుపెట్టిన తీరు హైలెట్ అని చెప్పాలి.

IHG

ఇక్కడ మ్యాటర్ ఏమిటంటే…. మొత్తం ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నది తెలియకుండానే అతి తక్కువ మంది భారత సైన్యం అక్కడికి వెళ్లి వారిపై ఆకస్మాత్తుగా దాడిచేసి హతమార్చడం విశేషం. రేబెన్ గ్రామంలో హిజ్బుల్ ముజాబుద్దిన్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో స్థానిక పోలీసులు-సిఆర్పిఎఫ్ జవాన్లు కలిగిన టీమ్ ఒక్క టాక్టికల్ (వ్యూహాత్మక) ఆపరేషన్ చేపట్టారు. వీరిని గమనించిన ఉగ్రవాదులు కాల్పులు దిగక ముందే ఎంతో అప్రమత్తంగా ఉన్న టీమ్ చుట్టుపక్కల నుండి దాడి చేసి వారి పై ఎదురుదాడికి దిగి ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు.

IHG

తర్వాత అదే ఊపులో ఇంకో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వారి నుండి ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు ఇప్పటికీ ఎన్ కౌంటర్  కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని - పూర్తయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా రెండ్రోజుల క్రితమే ఉగ్రవాదులకు షాక్ తగిలింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది - జైషే మహ్మద్ సంస్థకు చెందిన అబ్దుల్ రహమాన్ అలియాస్ ఫౌజీ భాయ్ ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: