కరోనా  వైరస్ క్లిష్ట కాలంలో సినీనటుడు సోనుసూద్ మానవత్వాన్ని చాటుకుంటు వలస  కార్మికులకు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. వలస కార్మికుల కోసం సోను సూద్ చేస్తున్న సహాయాన్ని మాటల్లో చెప్పలేము  అని చెప్పాలి. కార్మికుల పాలిట దేవుడిగా మారిపోయాడు సోనూసూద్. ఇప్పటివరకు వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు రైళ్లు బస్సులు ఏకంగా విమాన సర్వీసులను కూడా కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంతోమంది సోను సూద్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. వలస కార్మికుల కష్టాలను అర్థం చేసుకున్న ఏకైక మనిషి మీరే అంటూ ప్రశంసిస్తున్నారు. ఇలాంటి క్రమంలో నిన్న శివసేన నేత సంజయ్ దత్ సోనూసూద్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. 

 

 సోను సూద్ త్వరలో ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ని కలిసి ముంబైకి సెలబ్రిటీ మేనేజర్గా అయిపోతాడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు శివసేన నేత సంజయ్ రౌత్. లాక్‌డౌన్‌ అమలులో ఉన్న సమయంలో వలస కార్మికుల కోసం సోనుసూద్ అన్ని  బస్సులో ఎక్కడి నుండి తీసుకువచ్చారు అంటూ ప్రశంసించారు. ఇలా అందరూ సోనూసూద్  పై ప్రశంసలు కురిపిస్తుంటే శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా సోనూసూద్  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ని  కలవడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 

 


 మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నీ సోను సూద్  కలిసి మాట్లాడారు అంటూ ఆదిత్య థాక్రే చెప్పుకొచ్చారు. ఉద్ధవ్ థాకరే తో పాటు మంత్రి అస్లాం షేక్ కూడా ఉన్నారు అంటూ ఆదిత్య థాక్రే సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అందరం కలిసికట్టుగా ప్రజలకు సహాయం చేస్తామని ఈ సందర్భంగా ఉద్ధవ్ థాక్రే  పిలుపునిచ్చారు అంటూ చెప్పుకొచ్చారు ఆదిత్య థాక్రే. అయితే ఓ వైపు శివసేన కు సంబంధించిన నేత సంజయ్ రౌత్ సోను సూద్ పై  విమర్శల గుప్పించగా ప్రస్తుతం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సోనుసూద్ తో చర్చలు జరపడం ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: