రాజస్థాన్ లోని ఒక ప్రైవేటు డాక్టర్ తమ వాట్సాప్ గ్రూప్ లో చేసిన చాటింగ్ లీక్ కాగా పోలీసు వారు దాని పై ఎంక్వైరీ మొదలుపెట్టారు. అందులో సునీల్ చౌదరి అనే ఒక డాక్టర్ 'శ్రీచంద్ బర్దియ రోగ్ నిదాన్ కేంద్ర్' అనే ఒక ప్రైవేటు ఆర్థోపెడిక్ ఆస్పత్రిని నడుపుతున్నారు. అయితే వారికి 'బర్దియ రైజ్' అనే ఒక వాట్సప్ గ్రూపు ఉంది. ఇక శ్రీకాంత్ చౌదరి యొక్క భార్య కూడా డాక్టరు కాగా ఆమె మతపరమైన వ్యాఖ్యలను వాట్సాప్ గ్రూప్ లో చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

 

వివరాల్లోకి వెళితే అందులో ఒక స్టాఫ్ మెంబర్ రేపటినుండి 'నేను ముస్లిం పేషెంట్ల యొక్క ఎక్స్-రే లను తీయను' అని చెప్పి ఉండగా అదే వ్యక్తి మరొక మెసేజ్ లో 'రేపటి నుండి అందరూ ముస్లిం పేషెంట్లకు వైద్యం చేయవద్దు' అని కూడా ఉంది. దానికి స్పందిస్తూ ఒక డాక్టరు అదే గ్రూపులో "హిందువులకు కోవిడ్-19 సోకితే ఒక ముస్లిం డాక్టరు ఖచ్చితంగా వైద్యం చేయడని.. అలాగే నేను కూడా ఇకనుండి .పి లో ముస్లిం పేషెంట్లను చూడనని మరియు వారు ఎవరైనా వస్తే మేడం లేరు అని పంపించి వేయండి" అని స్టాఫ్ ను ఆదేశిస్తూ చేసిన మెసేజ్ యొక్క స్రీన్ షాట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

 

మొత్తం వాట్సాప్ చాట్ లీక్ కాగా విషయమై ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు హాస్పిటల్ కు చెందిన డాక్టర్ తన స్టాఫ్ ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని తమకు ఎటువంటి భేదభావాలు లేవని…. మెసేజ్ లకు తమని క్షమించాలని కోరడం గమనార్హం. ఇప్పటివరకు కేసు పై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోగా సోషల్ మీడియాలో వారి వ్యాఖ్యలపై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ఏదైనా మన దేశంలో హిందూ-ముస్లిం అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్న విపత్కర సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు రావడం అనేది చాలా దురదృష్టకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: