మామూలుగా సెలబ్రిటీలకు సంబంధించి ఏదైనా పోస్టు పెట్టారు అంటే కాస్త ముందు వెనక ఆలోచించి పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనే విషయం తెలిసిందే . పొరపాటున సెలబ్రిటీల గురించి ఒక పోస్టు పెట్టాలి  అనుకుని ఒక పోస్టు పెట్టారు అంటే ఎన్నో విమర్శలకు ఆగ్రహావేశాలకు గురవ్వాలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు కొంతమంది పెట్టే పోస్టులు ఇలా విమర్శలకు దారి తీస్తోంది. మొన్నటికి మొన్న చిరంజీవి విషయంలో కూడా ఇలాగే జరిగిన విషయం తెలిసిందే. కర్ణాటక సంబంధించినటువంటి చిరంజీవి పేరు ఉన్న  నటుడు మృతి చెందాడు. నటుడికి కూడా చిరంజీవి అని పేరు ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అతని మరణం. 

 


 ఇక ఆయనకు ఎంతో మంది ప్రముఖులు సంతాపం కూడా తెలియజేశారు. శోభాడే  అనే ఒక ప్రముఖ జర్నలిస్ట్ సదరు నటుడి  మరణానికి సంతాపం తెలియజేశారు. అయితే సదరు కర్ణాటక నటుడికి కాకుండా దక్షిణాదిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నా మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేస్తూ  ఫొటో పెట్టి సంతాపం తెలియజేశారు దీనిపై మెగా అభిమానులతో పాటు ఎంతోమంది తెలుగు దక్షిణాది ప్రేక్షకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పొరపాటు జరిగింది అని క్షమాపణలు చెప్పారు సదరు జర్నలిస్టులు. ఇక దీనిపై కాస్త పోస్ట్  చేసే ముందు వెనకా చూసుకోకుండా చేయాలి అంటూ ఏకంగా  హెచ్చరికలు కూడా జారీ చేశారు. 

 


 అయితే ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు రోహిత్ ఒక పోస్ట్  పెట్టారు. మామూలుగానే  రోహిత్ కొన్ని కామిక్ పోస్ట్ లు పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్  రజనీకాంత్ కి   కరోనా టెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే కరోనా కూడా క్వారంటైన్  అయింది అంటూ కామెడీ గా  ఒక పోస్టు పెట్టారు. ఇక ఈ అభిమానులకు వేరేలా  అర్థమైంది.  రజినీకాంత్ కి కరోనా  వైరస్ వచ్చింది అని ఆయన క్వారంటైన్ పాలు అయ్యారు అంటూ అర్థమైంది. 

 


 దీంతో ఈ పోస్ట్ పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్లడం తో ఎంతగానో హర్ట్ అయ్యారు అభిమానులు ప్రేక్షకులు. ఇక ఆ తర్వాత అసలు విషయం తెలిసిన తర్వాత ఇక యాక్టర్ ని తిట్టిపోయడం ప్రారంభించారు, ఎన్నో విమర్శలు కూడా చేశారు. ఇలా కాస్త కామెడీ ని పంచడానికి ఒక పోస్టు పెడితే ఏకంగా ఆయన విమర్శల పాలు చేసింది ఆ పోస్ట్ . అందుకే ప్రముఖ సెలబ్రిటీలకు సంబంధించి ఏదైనా పోస్ట్ పెట్టేటప్పుడు కాస్త చూసుకొని పోస్టు పెడితే ఎంతో బాగుంటుందని అంటున్నారు విశ్లేషకులు. పెద్ద సెలబ్రిటీ విషయంలో స్పందించేటప్పుడు  కాస్త ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా ఉంటే మంచిది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: