జగన్ డైనమిక్ సీఎం. ఆయన దూకుడు రాజకీయంగా మామూలుగా ఉండదు. అందుకే ఆయన కేవలం ఏడాది కాలంలో తొంబై శాతం హామీలు నెరవేర్చి శభాష్ అనిపించుకున్నారు. వర్తమానకాలంలో ఇలాంటి సీఎంలను చూడలేమని రాజకీయ విశ్లేషణలు కూడా పార్టీలకు అతీతంగా వచ్చాయి.

 

అయితే సంక్షేమంతో ఇంత చేసిన జగన్ పాలన విషయంలో మాత్రం తడబడుతున్నారని మేధావులు సహా అంతా అంటున్నారు. జగన్ ఆరు నెలల క్రితం మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రకటించారు. ఇప్పటికి కూడా అందులో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోగా ఇటు కోర్టు కేసులు, అటు పెద్దల సభ శాసనమండలి చిక్కులతో మూడు రాజధానుల కధ ఎప్పటికి తేలుతుందో ఎవరికీ అంతుబట్టని వైనమైంది.

 

ఇక బీజేపీ మాత్రం చాలా సింపుల్ గా  సులువుగా అతి చిన్న రాష్ట్రమైన ఉత్తరాఖండ్ లో రెండవ రాజధానిని ప్రకటించడమే కాదు, అమలు కూడా చేసేసింది. కేవలం 70 సీట్లు మాత్రమే ఉన్న ఉత్తరాఖండ్ కి రెండు రాజధానులు ఎందుకు అని ఎవరూ అనలేదు, అక్కడ ఏపీ మాదిరిగా రాజకీయ మేధావులు లేకపోయారులా ఉంది. అందుకే చాలా సైలెంట్ గా గైర్ సైన్  రెండవ రాజధాని ఏర్పాటు అయింది.

 

నిజానికి ఉత్తరాఖండ్ కి డెహ్రాడూన్ ఒక రాజధానిగా ఉంది, ఇపుడు కొండ ప్రాంతంలో రెండవ రాజధానిని ఏర్పాటు చేశారు. ఇది కేంద్రంతో వ్యవహారం. రాజధానులు మార్చాలంటే కేంద్ర పెద్దల అనుమతి తీసుకోవాలని నీతులు చెప్పే ఏపీ బీజేపీ నేతలు ఇపుడు ఏమంటారో. ఇక ప్రతీ జిల్లాకో రాజధానిని పెట్టుకోండి అంటూ ఈసడింపు మాటలు అనే ఎంపీ సుజనా చౌదరి లాంటి వారు ఏమంటారో.

 

రాజధానిని ప్రకటించే హక్కు ముఖ్యమంత్రి జగన్ కి లేదని వాదించే టీడీపీ, జనసేన పార్టీలు ఇపుడు ఉత్తరాఖండ్ సీఎం ను ఏమంటారో. ఏది ఏమైనా ఇది పాలనాపరమైన అంశం, ఎన్ని జిల్లాలు ఉండాలి, రాజధానులు ఉండాలి ఇవన్నీ పాలనా సౌలభ్యం కోసమే. ఆ సంగతి తెలిసి కూడా విపక్షాలు ఏపీలో రచ్చ చేసి కోతి పుండు బ్రహ్మ రాక్షసిగా చేస్తే  ఉత్తరాఖండ్ లో మాత్రం ఏ వివాదం లేకుండా ప్రభుత్వ సాధారణ ఉత్తర్వులతో కొత్త రాజధాని వచ్చేసింది. జగన్ కంటే ముందే  రాజధాని ప్రకటించి అక్కడి బీజేపీ దూకుడు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: