దేశంలో ఉన్న కొద్ది కరోనా వైరస్ ఉదృతంగా మారుతున్న నేపథ్యంలో పని చేస్తున్న ఎంప్లాయిస్ కి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటీవల దేశంలో బయటపడుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులలో ఎంప్లాయిస్ కూడా ఉండటంతో వారిని రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఎవరైతే ఆఫీస్ కి వెళ్లాలని భావిస్తున్నారో అటువంటివారికి జలుబు మరియు దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే వెళ్లకూడదని స్పష్టం చేసింది.

IHG

అనారోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు ఇల్లు వదిలి బయటకు రాకూడదని, ఇంటి నుండే పనిచేయాలని కేంద్రం సూచించింది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులే ఆఫీసులకు హాజరు కావాలని తెలిపింది. ఆఫీసులో కచ్చితంగా 20 మంది ఎంప్లాయిస్ కంటే ఎక్కువ ఉండకూడదు అని, ఉంటే సదరు కార్యాలయంపై చర్యలు తీసుకోవాల్సిందే అన్నట్టుగా కేంద్రం సూచించింది. అంతేకాకుండా కంటైన్మెంట్ జోన్లలో ఉండే వ్యక్తులు ఇంట్లో నుంచే పనిచేయాలని కేంద్రం పేర్కొన్నది. 

IHG

ఆఫీస్ లో తప్పనిసరిగా మాస్క్ లు వాడాలని సూచించింది.  మాస్క్ వాడని వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే ఎక్కువగా ఆఫీసులో రద్దీగా ఉండే ప్రదేశన్నీ గంటకి ఒకసారి శానిటేషన్ చేయాలి అని స్పష్టం చేసింది. అలాగే కంప్యూటర్ మరియు కీ బోర్డు లను ఎవరికి వారు శానిటైజ్ చేసుకోవాలని తాజా మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల లాక్ డౌన్ ఆంక్షలు మరియు సడలింపులు ఎత్తి వేసిన తర్వాత దేశంలో వైరస్ ప్రభావం ఉన్న కొద్ది పెరగటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: